Muslim Reservation: ఎన్నికల వేళ రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం.. OBC జాబితాలోకి ముస్లింలు..!
లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ ప్రయోజనాలను అందించడానికి కర్ణాటక ప్రభుత్వం ముస్లింలను వెనుకబడిన తరగతి (OBC)లో చేర్చింది. జాతీయ వెనుకబడిన కమీషన్ ఈ విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది.
లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ ప్రయోజనాలను అందించడానికి కర్ణాటక ప్రభుత్వం ముస్లింలను వెనుకబడిన తరగతి (OBC)లో చేర్చింది. జాతీయ వెనుకబడిన కమీషన్ ఈ విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది. కర్ణాటక ప్రభుత్వ వర్గాలు బుధవారం (ఏప్రిల్ 24) NCBC ఈ విషయాన్ని ధృవీకరించింది.
జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్, కర్ణాటక ప్రభుత్వ డేటా ప్రకారం, కర్ణాటకలోని ముస్లింలలోని అన్ని కులాలు, వర్గాల వారు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగ, విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల కోసం OBCల జాబితాలో చేర్చడం జరిగింది. దీంతో ఇక నుంచి కేటగిరీ II-B కింద, కర్ణాటక రాష్ట్రంలోని ముస్లింలందరూ OBCలుగా పరిగణించడం జరుగుతుంది. కేటగిరీ-1లో 17 ముస్లిం సంఘాలను ఓబీసీగా, కేటగిరీ-2ఏలో 19 ముస్లిం వర్గాలను ఓబీసీగా పరిగణించినట్లు కమిషన్ పేర్కొంది.
As per the data from Karnataka government, all castes and communities of Muslims of Karnataka have been included in the list of OBCs for reservation in employment and educational institutions under the state govt. Under Category II-B, all Muslims of Karnataka state have been… pic.twitter.com/eh1IYF3FX0
— ANI (@ANI) April 24, 2024
NCBC పత్రికా ప్రకటనలో ఏముంది?
NCBC ప్రెసిడెంట్ హన్సరాజ్ గంగారామ్ అహిర్ ప్రకారం, “కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో అడ్మిషన్ల కోసం కర్ణాటకలోని ముస్లింలందరూ OBCల రాష్ట్ర జాబితాలో చేర్చింది. కర్ణాటక ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జాతీయ వెనుకబడిన తరగతుల చట్టం కింద ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలో ముస్లిం జనాభా 12.32 శాతంగా పేర్కొంది.
కేటగిరీ-1లో ఓబీసీగా ముస్లిం వర్గాలు
కేటగిరీ 1 OBCలుగా పరిగణించబడుతున్న 17 ముస్లిం సంఘాలలో నదాఫ్, పింజర్, దర్వేష్, చప్పర్‌బంద్, కసబ్, ఫుల్మాలి (ముస్లిం), నల్‌బంద్, కసాయి, అథారి, షిక్కలిగరా, సిక్కలిగరా, సలాబంద్, లడాఫ్, తికానగర్, బాజిగరా, పింజారి ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..