Rahul Gandhi: రాహుల్ ఆరోపణలతో.. ఎన్నికల వ్యవస్థపై దేశవ్యాప్తంగా చర్చ.. రచ్చ!
ఓడినవాళ్లు ఈవీఎంలను బద్నాం చేయడం.. అదే ఈవీఎంలతో గెలవగానే ఆ విషయాన్ని పక్కనపెట్టడం చాలా సహజంగా జరుగుతోంది మనదేశంలో. ఇన్నాళ్లు ఈవీఎంల గురించి మాట్లాడుతూ వచ్చిన కాంగ్రెస్.. పర్టిక్యులర్‌గా రాహుల్‌గాంధీ.. కాస్త రూట్ మార్చి ఓటర్ల జాబితాలోనే అక్రమాలు జరిగాయంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అణుబాంబు పేల్చుతానంటూ రాహుల్‌గాంధీ పెట్టిన ప్రెస్‌మీట్‌తో అధికారపక్షం సైతం ఒక క్షణం ఆలోచనలో పడింది. జనరల్‌గా ఆన్ ద స్పాట్ కౌంటర్ యాక్షన్‌కు దిగే అలవాటున్న బీజేపీని.. ఆ క్షణం వరకు ఆలోచనలో పడేలా చేయగలగడమే తమ విజయం అని చెప్పుకుంటోంది కాంగ్రెస్. ఒకవిధంగా.. ఈ పదేళ్ల ప్రతిపక్ష పాత్రలో బీజేపీని ఈ లెవెల్‌లో నిలువరించిన సందర్భం లేదనేది రాజకీయ విశ్లేషకుల మాట. బట్.. బీజేపీ గానీ, ఇటు ఎలక్షన్ కమిషన్ గానీ బలమైన ప్రశ్నలే సంధిస్తోంది రాహుల్‌పైకి. నిజంగా పేలింది అణుబాంబే అయితే.. డిక్లరేషన్‌పై సంతకానికే ఎందుకు భయపడుతున్నారనేది బీజేపీ మొదటి ప్రశ్న. ఇన్నాళ్లకు బ్రహ్మాస్త్రం దొరికిందని కాంగ్రెస్ ఫీలవుతుంటే.. ఆట ఇప్పుడేగా మొదలైంది, ముగింపు ఎలా ఉండబోతోందో చూడండని కమలదళం సవాల్ విసురుతోంది. ఇంతకీ... ఈ హోరాహోరీ పోరులో ఎడ్జ్ ఎవరిది? రాహుల్ ఆరోపణలకు బీజేపీ సమాధానాలేంటి?

‘పకడ్బందీగా ఓట్ల చోరీ’. దేశం మొత్తం ఈ టాపిక్‌పై మాట్లాడుకుంటోందంటే… ఎలక్షన్ కమిషన్‌పై రాహుల్‌గాంధీ చేసిన ఈ ఆరోపణ చిన్నదేం కాదనే అర్థం. బ్యాలెట్ పద్దతి ఉన్నప్పుడు రిగ్గింగ్ ఆరోపణలు వచ్చేవి. ఈవీఎంలు వచ్చాక ఏదో గ్యాంబ్లింగ్ జరుగుతోందని ఆరోపణలు. వీవీప్యాట్ల ప్రూఫ్స్ ఉన్నా సరే… ఇంకా ఏవో అనుమానాలు. ఇవన్నీ పక్కకు పోయాయి ఇప్పుడు. ఏకంగా ఓటర్ లిస్ట్‌నే టార్గెట్ చేస్తున్నారు. కావాల్సిన నియోజకవర్గాల్లో ఓటర్లను సృష్టించి ఎన్నికల్లో గెలుస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. రాహుల్ గాంధీ చేసిన ఈ కామెంట్స్ ఎలక్షన్ కమిషన్‌పైనే అయినా.. నేరుగా తాకింది మాత్రం బీజేపీనే. అందుకే, బీజేపీ నుంచి రియాక్షన్ వస్తోంది. సింగిల్ బెడ్‌రూమ్ ఇంట్లో 48 ఓట్లు. ఒకే ఇంట్లో 80 ఓట్లు. ఇంటి నెంబర్ ‘జీరో’తో 100 ఓట్లు. ఒకే అడ్రస్‌తో 10వేలకు పైగా ఓటరు కార్డులు. ఎలా సాధ్యం ఇవన్నీ? రాహుల్‌గాంధీ ఇప్పుడు ప్రశ్నించారని కాదు గానీ.. ఓటర్ల జాబితా విషయంలో ఇలాంటి చిత్రవిచిత్రాలను ఎప్పటి నుంచో చూస్తున్నారు దేశ ప్రజలు. రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే వాళ్లకైతే రెండు రాష్ట్రాల ఓటర్ కార్డులు ఉంటాయి. ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర ఓటర్లుగా వాళ్ల పేర్లు రెండు రాష్ట్రాల జాబితాలో ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలా డబుల్ ఓటర్లు ఉన్నారు. సో, ఓటర్ల జాబితా విషయంలో అవకతవకలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ కూడా ఒప్పుకుంటోంది. అందుకేగా బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-SIR పేరుతో వాటన్నిటినీ...




