AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఉక్రెయిన్ అధ్యక్షుడితో తాజా పరిణామాలపై చర్చించిన ప్రధాని మోదీ

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో... భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీతో సోమవారం టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. తాజా పరిణామాలపై చర్చిస్తూ.. శాంతి స్థాపనకు సంబంధించిన అంశాలపై ఇరువురూ స్పష్టమైన అభిప్రాయాలు పంచుకున్నారు. పూర్తి వివరాలు కథనం లోపల...

PM Modi: ఉక్రెయిన్ అధ్యక్షుడితో తాజా పరిణామాలపై చర్చించిన ప్రధాని మోదీ
Ukranian President Volodymyr Zelenskyy - Prime Minister Narendra Modi
Ram Naramaneni
|

Updated on: Aug 11, 2025 | 7:16 PM

Share

ఉక్రెయిన్‌లో తాజా పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ సోమవారం టెలిఫోన్‌ ద్వారా చర్చించారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ తమ దేశ పరిస్థితులు, ఇటీవల జరిగిన పరిణామాలపై తన అభిప్రాయాలను భారత ప్రధానితో పంచుకున్నారు. ప్రాంతీయ పరిస్థితులు, యుద్ధ ప్రభావం, అంతర్జాతీయ సమాజం స్పందన వంటి అంశాలపై కూడా తన అభిప్రాయాలు వెల్లడించారు. సంభాషణలో ప్రధాని మోదీ.. ఉక్రెయిన్‌ సమస్యకు శాంతియుత పరిష్కారం సాధించే దిశగా భారతదేశం ఎప్పటికీ నిలకడైన, స్థిరమైన వైఖరిని పాటిస్తుందని మరోసారి స్పష్టం చేశారు. అలాగే.. త్వరగా దేశంలో శాంతియుత వాతావరణం ఏర్పడేందుకు సహాయపడే అన్ని ప్రయత్నాలకు భారత్‌ మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో అవసరమైన సహాయం అందించడానికి భారత్‌ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం, సాధ్యమైనంత తొందరగా శాంతి పునరుద్ధరించడమే తమ ప్రాధాన్యం అని మోదీ స్పష్టం చేశారు.

ఇరువురు నేతలు భారత్-ఉక్రెయిన్ ద్వైపాక్షిక భాగస్వామ్యం పురోగతిని రివ్యూ చేశారు.  వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక రంగం, విద్య, మానవతా సహాయం వంటి విభాగాల్లో సహకారాన్ని మరింత విస్తరించే దిశగా చర్చించారు. భవిష్యత్తులో కూడా ఇరువురూ సన్నిహితంగా సంప్రదింపులు కొనసాగించేందుకు అంగీకరించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..