నా భార్యను కాపాడండి.. వరదలో చిక్కుకున్న భర్త ఆవేదన
ఉత్తరచైనాను వరదలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వర్షాలతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. వరదలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో వరదలో చిక్కుకున్న ఓ జంటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వరదలో చిక్కుకున్న తన భార్యను కాపాడాలని భర్త పడిన ఆవేదన నెటిజన్లను హృదయాలను టచ్ చేసింది. వరదలో చిక్కుకున్న దంపతులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో రెస్క్యూ టీం వారివద్దకు వచ్చింది. దాంతో భర్త తన భార్యకు ఈత రాదని, ముందుగా తన భార్యను కాపాడాలని రెస్క్యూ టీమ్‌కి చెప్పాడు. వరదలో చిక్కుకోగానే తాము చాలా భయపడ్డామని, తన భార్య ఈత రాక ఏడ్వడం ప్రారంభించిందని తెలిపాడు. దయచేసి నా భార్యను కాపాడండి..నాకు ఈత వచ్చు .. నా కోసం చింతించకండి.. నా భార్యను రక్షించండి అంటూ వేడుకున్నాడు. దీంతో రెస్క్యూ టీం మొదట ఆ మహిళను వరదనుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లింది. అనంతరం ఆమె భర్తను కూడా కాపాడారు. సురక్షిత ప్రాంతానికి చేరుకున్న దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. రెస్క్యూ టీంకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను భావోద్వేగానికి గురిచేసింది. ఇంతగా ప్రేమించే భర్త ఉండటం ఆ భార్య అదృష్టం అని ఒకరు.. చాలా మంది కష్ట సమయాల్లో వెళ్లిపోతారు.. అయితే ఎటువంటి పరిస్థితి ఎదురైనా మనకు తోడుగా నిలబడే వ్యక్తులు ఉంటారని కొందరు వ్యాఖ్యానించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ వయసులో పెళ్లి చేసుకుంటేనే.. ఆ విషయంలో హ్యాపీ..
Rana Daggubati: బెట్టింగ్ యాప్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన రానా..
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

