AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ వయసులో పెళ్లి చేసుకుంటేనే.. ఆ విషయంలో హ్యాపీ..

ఈ వయసులో పెళ్లి చేసుకుంటేనే.. ఆ విషయంలో హ్యాపీ..

Phani CH
|

Updated on: Aug 11, 2025 | 4:30 PM

Share

ఇటీవల కాలంలో విడాకుల కేసులు ఎక్కువైపోయాయి. అందుకు కారణం సకాలంలో వివాహాలు చేసుకోకపోవడమే అంటున్నాయి అధ్యయనాలు. సాధారణంగా వివాహానికి.. 18 నుంచి 21 ఏళ్లలోపు వయసు సరైందనే భావన ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇది చట్టబద్దం కూడాను. అయితే ఇటీవల చాలా మంది జీవితంలో సెటిల్ అయ్యాకే వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో పెళ్లిని వాయిదా వేసుకుంటున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగటంతో లేటు మ్యారేజీలు, ఆ తర్వాత విడాకుల కేసులు పెరుగుతున్నాయని ఒక అధ్యయనం పేర్కొన్నది. సాధారణ వయసుకంటే లేటుగా లేదా మరీ త్వరగా జరిగే వివాహాల్లోనూ డివోర్స్ రేట్ అధికంగా ఉండే ఉందని ఆ పరిశోథన వెల్లడించింది. ఉటా(Utah) యూనివర్సిటీకి చెందిన సామాజిక శాస్త్రవేత్త నికోలస్ వోల్ఫింగర్ నేషనల్ సర్వే ఆఫ్ ఫ్యామిలీ గ్రోత్ డేటా ఆధారంగా నిర్వహించిన పరిశోధన ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 28 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసులో పెళ్లి చేసుకునే జంటలు ఎక్కువ సంతోషంగా ఉంటున్నారు. ఎందుకంటే.. ఈ వయసు పరిపక్వత, సంబంధాల మధ్య సమతుల్యతను సాధిస్తుంది. అంతేకాకుండా ఈ ఏజ్‌లో పెళ్లి చేసుకునేవారు జీవితంలో స్థిరత్వం, ఆర్థిక స్వాతంత్ర్యం, భాగస్వామితో సంబంధంలో మంచి అవగాహన కలిగి ఉంటారు. ఇది దీర్ఘకాలిక సంబంధాలను నిర్వహించడంలో కీలకపాత్ర పోషిస్తుందని అధ్యయనం పేర్కొంది. 25 ఏళ్లలోపు వివాహం చేసుకునే జంటల్లోనూ విడాకుల రిస్క్‌ ఎక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది. ఈ ఏజ్‌లో ఆర్థికంగా లేదా భావోద్వేగపరంగా వ్యక్తులు స్థిరపడరని ఆ రిపోర్టు వివరించింది. అలాగే, ఈ వయసులో జీవిత లక్ష్యాల పట్ల స్పష్టత లేకపోవడం,రిలేషన్స్ విషయంలో అవగాహనలోపం వంటివి విడాకులకు దారితీసే ఛాన్స్ ఎక్కువని తెలిపింది. అలాగే వివాహం ఆలస్యం చేయడం.. 35 ఏండ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే జంటల్లోనూ డివోర్స్ రిస్క్ పెరిగే చాన్స్ ఉందని అధ్యయనం తెలిపింది. వ్యక్తిగత అలవాట్లు, ఒకే తరహా జీవనశైలికి అలవాటు పడటం, మార్పును కోరుకోకపోవడం, వయసుకు, మనసుకు తగిన భాగస్వామి లభించలేదన్న నిరాశ వంటివి సంబంధాల్లో సమస్యలకు, క్రమంగా విడాకులకు దారితీయవచ్చు. మొత్తానికి 28 నుంచి 32 ఏండ్ల వయసు వివాహానికి అనువైనదని అధ్యయనం స్పష్టం చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rana Daggubati: బెట్టింగ్ యాప్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన రానా..