Rana Daggubati: బెట్టింగ్ యాప్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన రానా..
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ప్రముఖ నటుడు రానా నేడు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యాడు. రానాకు ఇప్పటికే అధికారులు నోటీసులు జారీ చేసి, అగ్రిమెంట్ కాపీలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటి పత్రాలతో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ప్రముఖ నటుడు రానా నేడు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యాడు. రానాకు ఇప్పటికే అధికారులు నోటీసులు జారీ చేసి, అగ్రిమెంట్ కాపీలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటి పత్రాలతో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ముందుగా షెడ్యూల్ ప్రకారం రానా జూలై 23న విచారణకు రావాల్సి ఉన్నా, షూటింగ్స్ కారణంగా సమయం ఇవ్వాలని ఆయన కోరారు. దీనిపై ఈడీ అధికారులు కొత్త తేదీని నిర్ణయించి, ఈ రోజే విచారణకు హాజరుకావాలని మళ్లీ నోటీసులు పంపించారు. కేసులో ఇప్పటికే పలువురు సినీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్యూయెన్సర్లను అధికారులు విచారించారు. షెడ్యూల్ ప్రకారంఈరోజు నటి మంచు లక్ష్మి కూడా విచారణకు హాజరుకానున్నారు. అక్రమ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించినందుకు మొత్తం 29 మందిని ECIRలో చేర్చినట్లు సమాచారం. రానా, మంచు లక్ష్మి విచారణల అనంతరం, మరికొందరు సెలబ్రిటీలను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందా అనే కోణంలో కూడా ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇది తలైవా క్రేజ్ అంటే.. పవర్ హౌస్ పాటకు సింగపూర్ పోలీసుల వీడియో
ఈ పాట విని 100 మంది చనిపోయారు.. దెబ్బకు 62 ఏళ్లు బ్యాన్ చేసిన ప్రభుత్వం
Chiranjeevi: మహేష్‌కు చిరు స్పెషల్ సర్‌ప్రైజ్
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

