Republic day 2024: ఆకట్టుకున్న రిపబ్లి డే పరేడ్.. ఒడిశాకు మొదటి బహుమతి, పీపుల్స్ ఛాయిస్‌లో ఏపీకి అవార్డు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన పరేడ్‌లో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రదర్శించిన శకటాల ప్రదర్శలో ఒడిశాకు మొదటి బహుమతి వరించింది. మహిళా సాధికారతతో పాటు హస్తకళలు, చేనేత రంగాన్ని ప్రదర్శించే రంగురంగులతో కూడిన ఒడిశా శకటాన్ని ప్రదర్శించింది. అతిథులను విశేషంగా ఆకట్టుకున్న శకటం మొదటి బహుమతిని గెలుచుకుంది. పీపుల్ ఛాయిస్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శకటానికి మూడో స్థానం లభించింది.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన పరేడ్‌లో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రదర్శించిన శకటాల ప్రదర్శలో ఒడిశాకు మొదటి బహుమతి వరించింది. మహిళా సాధికారతతో పాటు హస్తకళలు, చేనేత రంగాన్ని ప్రదర్శించే రంగురంగులతో కూడిన ఒడిశా శకటాన్ని ప్రదర్శించింది. అతిథులను విశేషంగా ఆకట్టుకున్న శకటం మొదటి బహుమతిని గెలుచుకుంది. పీపుల్ ఛాయిస్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శకటానికి మూడో స్థానం లభించింది.
ఈ నెల 26, 27 తేదీల్లో దేశ వ్యాప్తంగా నిర్వహించిన తొలి స్థానంలో గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన శకటం.. ద్వితీయ స్థానంలో యుపీ శకటం నిలిచాయి. ఇదే కాకుండా రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా జరిగిన సాంస్కృతిక పోటీలలో సైతం ఆంధ్రప్రదేశ్ కు తృతీయ స్థానం లభించింది. దీనిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ కళాకారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
పీపుల్స్ ఛాయిస్ విభాగంలో గుజరాత్‌లోని దొర్డో టూరిస్ట్ విలేజ్‌ని ప్రదర్శించే శకటం మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. రెండు విభాగాల్లో ఉత్తమ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ కంటోన్మెంట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేశారు.
సంప్రదాయ కవాతులో ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’ థీమ్‌పై సాంస్కృతిక మంత్రిత్వ శాఖ రూపొందించిన శకటానికి మొదటి బహుమతి లభించిందని అధికారులు తెలిపారు. చురుకైన గ్రామాలను వర్ణించే హోం మంత్రిత్వ శాఖ రూపొందించిన శకటం రెండో బహుమతిని పొందింది. ఇక, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి మొత్తం 16 శకటాలను, కేంద్ర మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాల నుండి తొమ్మిది శకటాలు గణతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో పరేడ్ నిర్వహించాయి.
అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, మణిపూర్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, లడఖ్, తమిళనాడు, గుజరాత్, మేఘాలయ, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అయా రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలు ప్రతిభించేలా శకటాలతో ప్రదర్శన నిర్వహించారు. కాగా, మూడేళ్ల తర్వాత గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటాన్ని ప్రదర్శించారు. తెలంగాణలో గ్రామీణస్థాయిలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో చాటుతూ తెలంగాణ శకటం కనువిందు చేసింది. తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధుల గాథలను చాటుతూ ఈ శకటాన్ని రూపొందించారు.
ఏపీ శకటంపై ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా డిజిటల్ విద్యా బోధన, నాడు నేడు, ఇంగ్లిష్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ఆంగ్ల మాధ్యమంలో బోధన నేపథ్యంతో ఏపీ శకటాన్ని రూపొందించారు. ప్రజాభిప్రాయ సేకరణలో వికసిత భారత్ భాగంగా రూపొందించిన ఏపీ శకటానికి మూడో స్థానం వచ్చింది. గుజరాత్ సరిహద్దు టూరిజం, ప్రపంచ గుర్తింపు థీమ్ ఆధారంగా రూపొందించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శకటం రామ్ లల్లా కళాత్మక విగ్రహన్ని ప్రదర్శించారు. ఈసారి పరేడ్‌లో మొదటి హై-స్పీడ్ ప్రాంతీయ వేగవంతమైన రవాణా వ్యవస్థ కూడా ఉంది.
మొత్తంగా చూస్తే, న్యాయమూర్తుల ఎంపిక విభాగంలో ఒడిశాకు చెందిన శకటం మొదటి స్థానంలో నిలవగా, ప్రజల ఎంపిక విభాగంలో గుజరాత్‌కు చెందిన శకటం అగ్రస్థానంలో నిలిచింది. న్యాయనిర్ణేతల విభాగంలో గుజరాత్ రెండో స్థానంలో నిలవగా, తమిళనాడు మూడో స్థానంలో నిలిచింది. పీపుల్స్ చాయిస్ కేటగిరీలో ఉత్తరప్రదేశ్ రెండో స్థానం, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచాయి. పీపుల్స్ ఛాయిస్ విభాగంలో విజేతలను ఎంపిక చేయడానికి, MyGov ప్లాట్‌ఫారమ్ ద్వారా పబ్లిక్ ఓటింగ్ నిర్వహించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




