Jammu Kashmir: బీజేపీ కశ్మీర్ ను ప్రయోగశాలగా మార్చుకుంది.. కేంద్రంపై విపక్షాల ఘాటు వ్యాఖ్యలు

కశ్మీర్ (Kashmir) ను బీజేపీ ప్రభుత్వం ప్రయోగశాలగా మార్చుకుందని మండిపడ్డారు. ఆర్టికల్‌ 370 రద్దుతో స్థానికేతరులు కూడా జమ్ముకశ్మీర్‌లో ఓటు వేయవచ్చన్న ఈసీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జమ్ము కశ్మీర్‌లో నివసిస్తున్న స్థానికేతరులు కూడా ఓటు..

Jammu Kashmir: బీజేపీ కశ్మీర్ ను ప్రయోగశాలగా మార్చుకుంది.. కేంద్రంపై విపక్షాల ఘాటు వ్యాఖ్యలు
Mufti
Follow us

|

Updated on: Aug 19, 2022 | 6:58 AM

కశ్మీర్ (Kashmir) ను బీజేపీ ప్రభుత్వం ప్రయోగశాలగా మార్చుకుందని మండిపడ్డారు. ఆర్టికల్‌ 370 రద్దుతో స్థానికేతరులు కూడా జమ్ముకశ్మీర్‌లో ఓటు వేయవచ్చన్న ఈసీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జమ్ము కశ్మీర్‌లో నివసిస్తున్న స్థానికేతరులు కూడా ఓటు వేయవచ్చన్న ఎన్నికల సంఘం నిర్ణయంపై హిమసీమలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఈసీ నిర్ణయంపై జమ్ముకశ్మీర్‌ విపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ విధానాలతో భారత్‌లో (India) ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లిందని ధ్వజమెత్తారు. కశ్మీర్‌లో చేసిన ప్రయోగాలను దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా కచ్చితంగా చేస్తారని హెచ్చరించారు. జమ్ముకశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో 25 లక్షల మంది స్థానికేతరులు కూడా ఈ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. లోకల్ కానప్పటికి ఇతర రాష్ట్రాల్లో ఓటును నమోదు చేసుకోని వాళ్లు జమ్ముకశ్మీర్‌లో ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. ఆర్టికల్‌ 370 రద్దుతో ఈ మార్పులు చేస్తునట్టు వెల్లడించింది.

కాగా.. ఈసీ నిర్ణయంపై పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ , నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. పాలస్తీనాను ఇజ్రాయెల్‌ ఆక్రమించినట్టు కశ్మీర్‌ను బీజేపీ ఎన్నికలతో ఆక్రమించే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో, ఎన్నికలు మగిసిన తర్వాత రిగ్గింగ్ జ‌రుగుతుంద‌ని ఆందోళన వ్యక్తం చేశారు. రిగ్గింగ్ కోసం ఈడీ వంటి ఏజెన్సీలను బీజేపీ వినియోగిస్తోంద‌ని, ఈడీ బీజేపీ భాగ‌స్వామిగా మారింద‌ని ముఫ్తీ ఆరోపించారు. ఈ అంశంపై ఫరూఖ్‌ నివాసంలో ఈనెల 22వ తేదీన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కశ్మీర్‌ను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని ప్రతిపక్ష పార్టీల నేతలు స్పష్టం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..