Shashi Tharoor: ‘కోవిద్ సిక్ బెడ్ పైనుంచి చెబుతున్నా’…. యుద్ధ ప్రాతిపదికన ఉచిత వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టండి’.. కాంగ్రెస్ నేత శశిథరూర్
కేంద్ర ప్రభుత్వం పాటిస్తున్న వ్యాక్సినేషన్ పాలసీని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తీవ్రంగా విమర్శించారు. ఏప్రిల్ లో కోవిద్ పాజిటివ్ కి గురై.. ప్రస్తుతం కోలుకుంటున్న ఆయన..
కేంద్ర ప్రభుత్వం పాటిస్తున్న వ్యాక్సినేషన్ పాలసీని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తీవ్రంగా విమర్శించారు. ఏప్రిల్ లో కోవిద్ పాజిటివ్ కి గురై.. ప్రస్తుతం కోలుకుంటున్న ఆయన.. తను చికిత్స పొందుతున్న ఆసుపత్రి బెడ్ పై నుంచే మాట్లాడారు.. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ‘కోవిడ్ నుంచి ఇండియాను కాపాడండి..ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వండి’ అని ఆయన కోరారు. ఈ ఏడాది అంతానికి దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ఆయన తప్పు పట్టారు. ప్రస్తుతం నేను నా కోవిద్ బెడ్ పై నుంచే మాట్లాడుతున్నా.. డిసెంబరుకల్లా దేశ ప్రజలందరికీ టీకామందులు ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటనను గమనించా.. కానీ అసలు దేశంలో వ్యాక్సిన్ లభ్యత ఉందా..కొరత తీవ్రంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి’ అని శశిథరూర్ పేర్కొన్నారు. కేంద్రం ఇస్తున్న హామీ బాగానే ఉందని, కానీ భారతీయులందరికీ టీకామందులు ఇచ్చేందుకు అనువుగా యూనివర్సల్ వ్యాక్సినేషన్ కి పర్మిట్ ఇచ్చేలా ప్రభుత్వ పాలసీలో మార్పులు చేయాలన్న కాంగ్రెస్ ప్రచారాన్ని సమర్థిస్తున్నానని ఆయన తెలిపారు. వేర్వేరు వ్యాక్సిన్ల ధరలను నిర్ణయించడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు.
ఈ విధానం వల్ల టీకామందుల ధరల మధ్య ఎంతో వ్యత్యాసం ఏర్పడుతోందని, నూతన లిబరలైజ్డ్ పాలసీలో చాలా లోపాలు ఉన్నాయని శశిథరూర్ విమర్శించారు. వీటిని మార్చాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా ఉండగా ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఈ వ్యాక్సినేషన్ పాలసీ లోపాలమయం అని విమర్శించింది. దీన్ని మార్చాలని సూచించింది. వ్యాక్సిన్ పాలసీపై తనకు తాను సుమోటోగా చేపట్టిన విచారణ సందర్బంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కేంద్రం రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని కూడా ఆదేశించింది.
My message from my Covid sickbed: #SpeakUpForFreeUniversalVaccination pic.twitter.com/JjKmV5Rk71
— Shashi Tharoor (@ShashiTharoor) June 2, 2021
మరిన్ని ఇక్కడ చూడండి: TS Formation Day Live: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు.. అమర వీరులకు కేసీఆర్ నివాళులు