My India My LiFE Goals: ప్రజా ఉద్యమంగా మారిన ఓ ఆలోచన.. ట్రీమ్యాన్ ఏం చేశారో తెలుసా..?

Tree Man Devender Sura: పర్యావరణం పచ్చగా ఉంటేనే ప్రజలు సంతోషంగా ఉండగలరు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏటా జూన్‌ 5 యావత్‌ ప్రపంచం పర్యావరణ దినోత్సవంలో భాగమవుతుంది.

My India My LiFE Goals: ప్రజా ఉద్యమంగా మారిన ఓ ఆలోచన.. ట్రీమ్యాన్ ఏం చేశారో తెలుసా..?
Tree Man Devender Sura
Follow us
Shaik Madar Saheb

| Edited By: TV9 Telugu

Updated on: Jun 26, 2023 | 7:37 PM

Tree Man Devender Sura: పర్యావరణం పచ్చగా ఉంటేనే ప్రజలు సంతోషంగా ఉండగలరు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏటా జూన్‌ 5 యావత్‌ ప్రపంచం పర్యావరణ దినోత్సవంలో భాగమవుతుంది. జూన్‌ 5, 1973 నుంచి ఈ ఉద్యమం కొనసాగుతోంది. అంటే ఈసారి జరుపుకుంటున్నది 50వది. ఈ సంవత్సర భారత్‌ నినాదం లైఫ్‌స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ మూవ్‌మెంట్‌ – లైఫ్‌. పర్యావరణ హితం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ఈ ఉద్యమంలో భాగస్వామిగా నిలుస్తున్నందుకు టీవీ9 గర్విస్తోంది. మై ఇండియా – మై లైఫ్‌ గోల్స్‌ పేరుతో ఈ ఏడాది పర్యావరణ ఉద్యమాన్ని చేపట్టింది భారత్‌. ఈ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా చేపట్టిన ఈ ఉద్యమం జీవనశైలిలో పర్యావరణాన్ని భాగం చేసుకొని సూచిస్తోంది. దీనికి లైఫ్‌ స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ మూవ్‌మెంట్‌ అని నామకరణం చేశారు. పర్యావరణం విషయంలో దేశ ప్రజల్లో అవగాహన పెంచి పర్యావరణ సంరక్షణలో వారిని భాగం చేయడం ఈ ఉద్యమ లక్ష్యం. పర్యావరణాన్ని కాపాడుకోవడమన్నది దేశ పౌరుల ప్రాథమిక విధుల్లో ఒకటనే చెప్పాలి. ప్రతీ పౌరుడు ఈ కర్తవ్యాన్ని అనుసరించినట్టు అయితే నవభారత కలలు కచ్చితంగా నెరవేరుతాయి. ఈ ఉద్యమంలో మేము భాగస్వాములుగా నిలిచాం. మీరు కూడా అడుగు వేయండి, పర్యావరణ పరిరక్షణలో మీ వంతు సహకారాన్ని అందించండి.

పర్యావరణం కోసం విశేషంగా కృషి చేస్తున్న తెలుగు వ్యక్తి.. ప్రద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య గురించి మనందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి హరియాణాలో ఉన్నారు. చేసేది పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగమైనా పర్యావరణం కోసం ఎంతో పాటు పడుతున్న సోనిపట్ నివాసి దేవేంద్ర సురకు హరియాణా ట్రీమ్యాన్‌ అనే పేరుంది. ఒక మనిషికి వచ్చిన ఆలోచన ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారింది. ట్రీమ్యాన్ దేవేంద్ర సుర చర్యలతో చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో చాలా మార్పు వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..