Mumbai Rains: ముంబైలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ, పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి

ముంబై, దాని శివారు ప్రాంతాలలో "మోస్తరు నుండి భారీ వర్షాలు" కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందాలను నగరంలో మోహరించినట్లు అధికారులు తెలిపారు

Mumbai Rains: ముంబైలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ, పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి
Mumbai Rains
Follow us

|

Updated on: Jul 05, 2022 | 11:15 AM

Mumbai Rains: దేశ ఆర్ధిక రాజధాని ముంబై ని భారీ వర్షాలు అతకుతలం చేస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ముంబై, దాని శివారు ప్రాంతాలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారు జాము నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో..  నగరంలోని కొన్ని ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. భారీ ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సియోన్ రోడ్లు నీటితో నిండిపోయాయి. అంధేరీలోకూడా మోకాళ్ళ లోతు నీరు నిలిచిపోయింది.

సియోన్, పరేల్, బాంద్రా, కుర్లా, ఘట్‌కోపర్, చెంబూర్, శాంతాక్రూజ్, అంధేరి, మలాడ్ మరియు దహిసర్‌తో సహా పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైల్వే ట్రాక్లు నీట మునిగాయి. ముంబైకి లైఫ్ లైన్ గా పరిగణించబడే లోకల్ రైలు సర్వీసులు సెంట్రల్ రైల్వే , వెస్ట్రన్ రైల్వే రూట్లలో రైళ్లు సాధారణంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. అయితే పలు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవడంతో కొన్ని రూట్లలో బస్సులను దారి మళ్లించారు.

ఇవి కూడా చదవండి

మంగళవారం ఉదయం 8 గంటలకు ముగిసిన 24 గంటల వ్యవధిలో నగరంలో సగటున 95.81 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే సమయంలో తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో వరుసగా 115.09 మిమీ, 116.73 మిమీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ముంబై, దాని శివారు ప్రాంతాలలో “మోస్తరు నుండి భారీ వర్షాలు” కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD)  అంచనా వేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందాలను నగరంలో మోహరించినట్లు అధికారులు తెలిపారు. ముంబైలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందాలను నగరంలో మోహరించినట్లు అధికారులు తెలిపారు

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన ఏక్‌నాథ్ షిండే ముంబైతోపాటు పొరుగు జిల్లాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. “రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, సిఎం ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనుకుమార్ శ్రీవాస్తవతో చర్చలు జరిపారు. అలాగే అన్ని సంబంధిత జిల్లాల సంరక్షక కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని నియంత్రించాలని ఆదేశించారు” అని ఆయన కార్యాలయం ట్వీట్ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..