కొద్దిరోజుల్లో పెళ్లి చేసుకోనున్న జంట.. విమానం ఆలస్యం కావడంతో హోటల్‌కి వెళ్లారు.. చివరికి
మరికొన్ని రోజుల్లో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఓ యువ జంట సిద్ధమైంది. మూడుమూళ్ల బంధంతో మరికొద్ది రోజుల్లోనే ఒకటి కాబోతున్నారు. కానీ ఇంతలోనే ఊహించని ఘటన చోటుచేసుకుంది. విదేశి ప్రయాణానికి సిద్ధమైన ఆ జంట మృత్యువు ఒడిలోకి చేరిపోయారు. విమానం ఆలస్యం కావడం వల్ల ఓ హోటల్‌కు వెళ్లడంతో ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో వారు అగ్నికి ఆహుతయ్యారు.

మరికొన్ని రోజుల్లో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఓ యువ జంట సిద్ధమైంది. మూడుమూళ్ల బంధంతో మరికొద్ది రోజుల్లోనే ఒకటి కాబోతున్నారు. కానీ ఇంతలోనే ఊహించని ఘటన చోటుచేసుకుంది. విదేశి ప్రయాణానికి సిద్ధమైన ఆ జంట మృత్యువు ఒడిలోకి చేరిపోయారు. విమానం ఆలస్యం కావడం వల్ల ఓ హోటల్‌కు వెళ్లడంతో ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో వారు అగ్నికి ఆహుతయ్యారు. ముంబయిలోని సాంతాక్రూజ్ అనే ప్రాంతంలో ఆదివారం రోజున ఈ దారణమైన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురిలో.. మరికొద్ది రోజుల్లోనే పెళ్లి పీటలు ఎక్కనున్న ఓ జంట కూడా ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ఇంతకి అసలు ఏం జరిగింది. ఆ జంట హోటల్‌కు ఎందుకు వెళ్లింది.. ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఇక వివరాల్లోకి వెళ్తే గుజరాత్‌కు చెందిన కిషన్ హలాయ్ (28).. అతని ప్రియురాలు రూపాల్ వెకారియాల (25) కుటుంబ సభ్యులు కెన్యా రాజధాని నైరోబిలో స్థిరపడిపోయారు. అయితే కిషన్ హలాయ్ సోదరుడి వివాహం రెండు నెలల క్రితం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ రెండు కుటుంబాలు గుజరాత్‌కు వచ్చాయి. అయితే కిషన్ తల్లిదండ్రులతో పాటు ఆ నూతన జంట వారం క్రితమే తిరిగి కెన్యాకు వెళ్లిపోయారు. కిషన్, రూపాల్‌కు కూడా ఇటీవలే పెళ్లి ఫిక్స్ అయింది. అయితే అక్కడికి వెళ్లిన కొన్ని రోజుల తర్వాత పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే కిషన్, రూపాల్ కెన్యా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆగస్టు 27న ముంబయి విమానశ్రయానికి చేరుకున్నారు. కానీ వారు వెళ్లాల్సిన విమానం సమయం మారిపోయింది. ఇక చేసేదేమి లేక కిషన్, రూపాల్, ఆమె తల్లి, సోదరికి స్థానికంగా ఉన్నటువంటి ఓ హోటల్‌లో ఆ విమానయాన సంస్థ బసను ఏర్పాటు చేసింది.




అయితే ఈ క్రమంలోనే వారు ఉంటున్న హోటల్‌లో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే వారిలో కిషన్, రూపాల్‌తో పాటు కాంతీలాల్ వారా అనే మరో వ్యక్తి కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇక రూపాల్ తల్లి, సోదరితోపాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. అయితే మరికొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకోనున్న జంట ఇలా అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న రెండు కుటుంబాలు షాక్ అయిపోయాయి. దీంతో వారి స్వస్థలం రామ్‌పుర్ అనే గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొద్దిరోజుల్లోనే కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే జంటకు ఇలా జరగడంపై కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయంశమవుతోంది.