Viral: తన స్టూడెంట్‌పై మోజు పడ్డ ఇంగ్లీషు టీచర్ – ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చి మరి అరాచకం
ముంబైలోని ప్రముఖ పాఠశాలలో పని చేసే మహిళా టీచర్ చేతిలో 16 ఏళ్ల విద్యార్థిని లైంగిక వేధింపులకు గురైన ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. బాలుడిపై ఏడాది పాటు లైంగిక దాడులకు పాల్పడిన టీచర్‌ను, ఆమెకు సహకరించిన స్నేహితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోక్సో సహా పలు చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

ముంబైలోని ప్రముఖ పాఠశాలలో పని చేసే 40 ఏళ్ల మహిళా ఉపాధ్యాయురాలిని 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది కాలంగా ఆమె పలుమార్లు బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి. గౌరవ వృత్తిలో ఉండి.. పైళ్లై పిల్లలు కూడా ఉన్న ఈమె.. తప్పుడు పనికి పాల్పడింది. పోక్సో, జువైనల్ జస్టిస్ యాక్ట్, BNSలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం ఎలాంటి ప్రకటనా చేయలేదు.
ఆ టీచర్ ఇంగ్లీష్ టీచ్ చేసేవారు. ఇంటర్ ఫస్టియర్ చదివే సమయంలో ఆ టీనేజర్‌కి క్లాస్ తీసుకున్నారు. 2023 డిసెంబర్‌లో పాఠశాల యాన్యువల్ డే కోసం డ్యాన్స్ గ్రూప్ ఏర్పాటు చేయడంలో భాగంగా ఆ బాలుడితో పలుమార్లు కలుసుకున్నారు. ఆ సమయంలోనే బాలుడి పట్ల ఆకర్షితురాలయ్యానని టీచర్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. 2024 జనవరిలో విద్యార్థికి లైంగికంగా దగ్గరయ్యేందుకు టీచర్ ప్రయత్నించింది. ఆ సమయంలో బాలుడు ఆమెను దూరం పెట్టే ప్రయత్నం చేశాడు. దీంతో టీచర్ తన స్కూల్‌కు సంబంధంలేని ఓ స్నేహితురాలితో.. విద్యార్థిని ఒప్పించే ప్రయత్నం చేయించిందని పోలీసులు తెలిపారు.
ఆ స్నేహితురాలు విద్యార్థికి కాల్ చేసి.. మహిళలతో టీనేజ్ బాయ్స్‌కు సంబంధాలు ఇప్పుడు చాలా కామన్ అని కన్విన్స్ చేసినట్లు సమాచారం. అంతేకాదు మీ ఇద్దరి జోడి చూడముచ్చటగా ఉంటుంది అంటూ బాలుడికి బ్రెయిన్ వాష్ చేసిందట. దీంతో విద్యార్థి మళ్లీ ఆ టీచర్‌ను కలవడానికి సిద్ధమయ్యాడు. ఆ తర్వాత టీచర్ తన సొంత కారులో నిర్మానుష్య ప్రదేశానికి బాలుడిని తీసుకెళ్లి.. బలవంతంగా దుస్తులు విప్పించి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు బాలుడు ఆందోళనకు గురవ్వవగా.. టీచర్ అతనికి యాంగ్జైటీ మెడిసిన్ కూడా ఇచ్చిందట. ఆ తర్వాత టీచర్ బాలుడిని మద్యం తాగించి.. సౌంత్ ముంబై, ఎయిర్‌పోర్ట్ సమీప ప్రాంతాల్లోని ఫైవ్‌స్టార్ హోటళ్లకు తీసుకెళ్లి.. లైంగిక దాడులు చేసినట్లు ఓ పోలీసు అధికారు వివరించారు.
విద్యార్థి ప్రవర్తనలో మార్పులు గమనించిన కుటుంబ సభ్యులు ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. అయితే, విద్యార్థి త్వరలో ఇంటర్ పూర్తి చేస్తున్నాడు కాబట్టి.. అప్పటివరకు ఈ విషయాన్ని వదిలేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. అయితే సదరు స్టూడెంట్ ఇంటర్ కంప్లీట్ చేసి అక్కడి నుంచి వెళ్లిన తర్వాత కూడా టీచర్ మళ్లీ అతనిని సంప్రదించింది. ఆమె తన ఇంట్లో పని చేసే వ్యక్తి ద్వారా విద్యార్థిని కలవాలని చెప్పడంతో.. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. టీచర్‌తో పాటు ఆమెకు సహకరించిన స్నేహితురాలిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
అందుకే పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నా.. సాయంత్రం ఇంటికి వచ్చాక.. వారితో కొంత సమయం గడపాలి. వారి ప్రవర్తన లేదా మాటల్లో ఏమైనా ఇబ్బంది కనిపిస్తే వెంటనే అప్రమత్తమవ్వాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.
