AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Boat Accident: విహార యాత్రలో ఊహించని విషాదం.. ముంబై సముద్ర తీరంలో బోటు ఎలా మునిగిందంటే..

విహార యాత్రలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. ముంబయి సముద్ర తీరంలో బోటులో విహరిస్తూ ఆహ్లాదకరంగా గడుపుతున్న పర్యాటకులపైకి ఒక్కసారి మృత్యువు దూసుకొచ్చింది. ఊహించని ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.. ఈ ఘటనపై ప్రధాని మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు..

Mumbai Boat Accident: విహార యాత్రలో ఊహించని విషాదం.. ముంబై సముద్ర తీరంలో బోటు ఎలా మునిగిందంటే..
Mumbai Boat Accident
Shaik Madar Saheb
|

Updated on: Dec 19, 2024 | 7:44 AM

Share

ముంబయి సముద్ర తీరంలో పెను విషాదం చోటుచేసుకుంది. ముంబయి సముద్ర తీరంలో బోటులో విహరిస్తూ ఆహ్లాదకరంగా గడుపుతున్న పర్యాటకులపైకి ఒక్కసారి మృత్యువు దూసుకొచ్చింది. పర్యాటకులతో వెళ్తున్న పడవను నేవీకి చెందిన బోటు ఢీకొట్టిన ఘటనలో 13 మంది మృతిచెందారు. మరో 101 మంది ప్రయాణికులను సిబ్బంది రక్షించారు. చనిపోయిన వారిలో 10 మంది పర్యాటకులు.. ముగ్గురు నేవీ సిబ్బంది ఉన్నారు.

గేట్‌ వే ఆఫ్‌ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు నీల్‌కమల్‌ అనే ఫెర్రీ.. దాదాపు 100 మందికి పైగా పర్యాటకులతో బయలుదేరింది. ఇదే సమయంలో చక్కర్లు కొడుతూ వేగంగా వచ్చిన నేవీ స్పీడ్ బోటు ఊహించనవిధంగా ఫెర్రీని ఢీకొట్టింది. ఫెర్రీ ఒక్కసారిగా తలకిందులై నీటమునిగి పోవడంతో హాహాకారాలు చెలరేగాయి. రెండు బోట్లు ఢీకొని ప్రయాణికులు నీళ్లల్లో పడిపోయిన వెంటనే భారత కోస్ట్ గార్డ్ రంగంలోకి వంద మందికి ప్రాణాలు కాపాడారు.

మధ్యాహ్నం 3.55 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.. తీవ్రగాయాలైనవారికి నేవీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.. ఈ మొత్తం ఘటనపై పోలీసులు, నేవీ దర్యాప్తు చేస్తామని సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ వెల్లడించారు.

ఈ దుర్ఘటనలో 13మంది ప్రాణాలు కోల్పోవడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తక్షణ సహాయక చర్యలకు అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై పోలీసులు, నేవీ దర్యాప్తు చేస్తామని సీఎం వెల్లడించారు.

ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

ముంబయి సముద్ర తీరంలో బోటు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.. దీంతో పాటు మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల నష్టపరిహారం ప్రకటించారు.

ఈ ఘటనపై ఇండియన్‌ నేవీ రియాక్ట్‌ అయింది. స్పీడ్‌ బోటు ఇంజిన్‌ ట్రయల్స్‌ చేస్తున్న క్రమంలో సాంకేతిక లోపం తలెత్తిందని, దాంతో బోటు నియంత్రణ కోల్పోయి ఫెర్రీని ఢీకొన్నట్లు వెల్లడించింది. మరోవైపు, రెస్క్యూ బృందాలు భారీ ఆపరేషన్‌ చేపట్టాయి. 11 నేవీ పడవలతో సహా తీర ప్రాంత దళాలకు చెందిన మూడు పడవలు, నాలుగు హెలికాప్టర్లు కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. పోర్టు అధికారులు, కోస్ట్‌గార్డ్‌, మత్స్యకారుల సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..