పెద్దమనసు చాటుకున్న ముఖేష్ అంబానీ..! కరోనా పేషెంట్ల కోసం ఉచితంగా ఆక్సిజన్‌ సిలిండర్ల సరఫరా..

Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, బిలియనీర్ ముఖేష్ అంబానీ కరోనా పేషెంట్ల కోసం తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. గుజరాత్‌లోని

పెద్దమనసు చాటుకున్న ముఖేష్ అంబానీ..! కరోనా పేషెంట్ల కోసం ఉచితంగా ఆక్సిజన్‌ సిలిండర్ల సరఫరా..
Mukesh Ambani
Follow us

|

Updated on: Apr 15, 2021 | 7:02 PM

Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, బిలియనీర్ ముఖేష్ అంబానీ కరోనా పేషెంట్ల కోసం తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. గుజరాత్‌లోని జామ్‌నగర్ నుంచి మహారాష్ట్రకు ఎటువంటి ఖర్చు లేకుండా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. రిలయన్స్ నుంచి రాష్ట్రానికి 100 టన్నుల గ్యాస్ లభిస్తుందని పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి ఏక్నాథ్ షిండే ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కరోనా రెండో వేవ్‌ ఇండియా మొత్తం వ్యాపిస్తోంది. పెరుగుతున్న పేషెంట్ల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. మీడియాలో ఆక్సిజన్‌ కొరత వల్ల కరోనా రోగులు మరణిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముంబైలో కరోనా చాలా వేగంగా వ్యాపిస్తోంది. రిలయన్స్ ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఉంది. దీంతో రిలయన్స్ తన పెట్రోలియం కోక్ గ్యాసిఫికేషన్ యూనిట్ల కోసం ఉద్దేశించిన కొన్ని ఆక్సిజన్ ప్రవాహాలను వైద్య వినియోగానికి మళ్లించినట్లు అధికారి తెలిపారు.

కేరళలోని కొచ్చి రిఫైనరీలో 20 టన్నుల ఆక్సిజన్ నిల్వను ప్రభుత్వ నిర్వహణలో ఉన్న భారత్ పెట్రోలియం కార్ప్ తయారు చేసింది. ఇది వైద్య వినియోగం కోసం బాట్లర్లకు సరఫరా చేస్తోందని కంపెనీ అధికారి తెలిపారు. అయితే బీపీసీఎల్ ప్రెస్ ఆఫీస్‌కు పంపిన ఇమెయిల్‌పై ఎవరూ స్పందించలేదు. నత్రజని ఉత్పత్తి తయారు చేసే కర్మాగారాలలో కార్మికుల భద్రత కోసం ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేస్తారు. 99.9 శాతం స్వచ్ఛంగా ఉండటానికి కార్బన్ డయాక్సైడ్ వంటి ఇతర వాయువులను వినియోగిస్తారు. ఈ ఆక్సిజన్‌ను ప్రస్తుతం వైద్యం కోసం వాడుతున్నట్లు తెలుస్తోంది.

Corona Effect: సినిమా రంగంపై కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం.. బడా సినిమాల షూటింగ్‌లకు బ్రేక్‌..

Viral: ఒకే అమ్మాయిని నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు.. రీజన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే.!

Sweet Surprise: లక్ అంటే ఇదేనేమో .. ఆన్‌లైన్‌లో యాపిల్స్ ఆర్డర్ చేస్తే.. ఐఫోన్ వచ్చింది.. ఎక్కడంటే