AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mysterious Malana: తమ జాతిని రక్షించుకోవడం కోసం గత కొన్నేళ్లుగా ఐసోలేషన్ లోనే ఉంటున్న గ్రామస్థులు.. ఎక్కడంటే

కరోనా వైరస్ నివారణ కోసం ప్రపంచం మొత్తం ఎవరికీ ఎవరూ కాకుండా ఏకాకిగా జీవితం గడుపుతున్నారు. ఎవరిని కలవకుండా ఒక ఇంట్లో.. లేదా ఒక గ్రామంలో నివసించడం మనకు ఏడాది నుంచి..

Mysterious Malana: తమ జాతిని రక్షించుకోవడం కోసం గత కొన్నేళ్లుగా ఐసోలేషన్ లోనే ఉంటున్న గ్రామస్థులు.. ఎక్కడంటే
Malana Village
Surya Kala
|

Updated on: Apr 15, 2021 | 6:15 PM

Share

Mysterious Malana: కరోనా వైరస్ నివారణ కోసం ప్రపంచం మొత్తం ఎవరికీ ఎవరూ కాకుండా ఏకాకిగా జీవితం గడుపుతున్నారు. ఎవరిని కలవకుండా ఒక ఇంట్లో.. లేదా ఒక గ్రామంలో నివసించడం మనకు ఏడాది నుంచి మాత్రమే తెలుసు.. అలవాటు.. క్వారంటైన్, ఐసోలేషన్ వంటి పదాలు గత ఏడాదిగా మనజీవితంలో ఒక భాగంగా మారిపోయాయి. అయితే హిమాచల్ ప్రదేశ్ లోని ఒక గ్రామం మాత్రం గత ఎన్నిఏళ్లుగా ఐసోలేషన్ లో ఉంటున్నారు. ఇక్కడ గ్రామస్థులు ఎవరినీ కలవరు.. తమలో మరెవరిని కలవనివ్వరు. ఇంకా చెప్పాలంటే ఈ గ్రామస్థులకు ప్రపంచంతో సంబంధం లేదు.. ఎక్కడ ఎం జరుగుతున్నా వీరికి అనవసరం.. వీళ్ళ ఊరే వీరికి ప్రపంచం. .సకలం..

హిమాలయాలకు దగ్గరగా ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలో పార్వతీవ్యాలీలోని మలన గ్రామం వెరీ వెరీ స్పెషల్. ఈ గ్రామం సముద్రమట్టానికి 8,701 అడుగుల ఎత్తులో చుట్టూ కొండల మధ్య పకృతి అందాలతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక ఈ గ్రామంలోని గ్రామస్థులు బాహ్య ప్రపంచంతో మాకు సంబంధం లేదు అన్నచందంగా జీవిస్తారు. అసలు ఎందుకు ఇరుగు పొరుగు గ్రామాలతో కూడా సంబంధాలను నెరపరు. చుట్టుపక్కల గ్రామస్థులతో మాట్లాడరు పెళ్లి పేరంటాలకు వెళ్ళరు. బంధుత్వాలను కలుపుకోరు.మలన గ్రామ దేవత ‘జంబ్లూ’. వీరు మాట్లాడే భాషను కనషీ అని అంటారు. ఈ భాష ఈ గ్రామస్థులకు తప్ప ఇతరులకు అర్ధం కాదు..కనషీ భాషలో ఎక్కువగా సంస్కృత పదాలే ఉంటారు.. కొంచెం టిబెట్‌ భాష ప్రభావం కూడా కనిపిస్తుంది.

ఇక ఈ గ్రామష్టులు తమ పిల్లలకు పెట్టె పేర్లు కూడా తమ జాతి సంప్రదాయాన్ని అనుసరించి ఉంటాయి. వారం లో ఈరోజు పుడితే.. ఆరోజునే పేరుగా పెట్టుకుంటారు. ఆదివారం పుడితే అహ్త, సోమవారం జన్మిస్తే సౌనరు, మంగళవారం అయితే మంగల్‌ ఇలా.. వాళ్లు పుట్టిన వారాన్ని బట్టి పేర్లు పెడతారు. ఈ గ్రామంలో ఒకే పేర్లున్న వక్తులు ఎక్కువమంది ఉంటారు. ఈ గ్రామస్థులు తమ ఊరిలో వండిన వంటకాలను తింటారు.. తప్పించి చుట్టుపక్కలవారు వండిన ఆహారపదార్ధాలను ముట్టుకోరు. వీరు తమ గ్రామం దాటి బయటకు వెళ్ళరు.. వేరే బయట వ్యక్తులను వీరు తమ ఊరిలోకి రానివ్వరు. ఇలా ఎందుకు ఈ గ్రామస్థులు జీవిస్తున్నారు అంటే.. తమ జాతి కలుషితం కాకుండా ఉండడం కోసమే అని చెబుతారు.  ప్రభుత్వం తో సంబంధం లేకుండా జీవిస్తున్న మలన గ్రామస్థులు తమకంటూ పెట్టుకున్న నియమాలను, కట్టుబాట్లను అనుసరిస్తూ జీవిస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఈ గ్రామంలో ఒక పాఠశాలకు అనుమతిని ఇచ్చారు.

Also Read:  నరుడుగా పుట్టి.. దైవంగా పూజలందుకుంటున్న శ్రీరాముడి గుణాలు ఏమిటంటే..!  

కోడి, నెమలి కలయిక ఈ పక్షి.. అనేక గొంతులను మిమిక్రీ చేయడమే ఈ పక్షి స్పెషల్. .ఎక్కడంటే..!