AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Miejsce odrzanskle: ప్రపంచంలో వింతైన గ్రామం.. ఆడపిల్లలు మాత్రమే పుట్టే గ్రామం.. 10 ఏళ్లలో ఒక్క మగాడు మాత్రమే జననం

Only Girls Village: సృష్టిలో ఆడమగ ఇద్దరూ సమానమే.. ప్రకృతి, పురుషుడు కలిస్తేనే సృష్టి అని ఎంత మంది ఎన్ని చెప్పినా లింగ వివక్షత కొనసాగుతూనే ఉంది. ఆడామగా బేధం ఒక్క మనదేశంలోనే కాదు.. ప్రపంచంలో అనేక దేశాల్లో ఉంది...

Miejsce odrzanskle: ప్రపంచంలో వింతైన గ్రామం.. ఆడపిల్లలు మాత్రమే పుట్టే గ్రామం.. 10 ఏళ్లలో ఒక్క మగాడు మాత్రమే జననం
Only Girls Village
Surya Kala
|

Updated on: Apr 16, 2021 | 2:26 PM

Share

Only Girls Village: సృష్టిలో ఆడమగ ఇద్దరూ సమానమే.. ప్రకృతి, పురుషుడు కలిస్తేనే సృష్టి అని ఎంత మంది ఎన్ని చెప్పినా లింగ వివక్షత కొనసాగుతూనే ఉంది. ఆడామగా బేధం ఒక్క మనదేశంలోనే కాదు.. ప్రపంచంలో అనేక దేశాల్లో ఉంది. కడుపులో ఉంది ఆడపిల్ల అని తెలిసి కడుపులోనే పిండాన్ని చిదిమేస్తున్నారు.. మరికొందరు పుట్టిన తర్వాత చెత్తకుప్పలు పాలు జేస్తున్నారు. వంటి వార్తలు అనేకం వింటూనే ఉన్నాం. ప్రపంచ వ్యాప్తంగా మహిళల సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఓ గ్రామంలో మాత్రం మహాలక్ష్ములే పుడుతున్నారు. అసలు అక్కడ ఏళ్లకేళ్లు అంటే దాదాపు 10 ఏళ్ల పాటు ఆ గ్రామంలో మగపిల్లవాడు జన్మించలేదట. దీంతో ఆ గ్రామంలో ఎక్కడ చూసినా ఆడపిల్లలు నవ్వులు చిందిస్తూ దర్శనమిస్తారు.. అక్కడ స్థానిక ప్రభుతం ఆ గ్రామంలో మగపిల్లవాడు పుడితే తల్లిదండ్రులకు బహుమతి ఇస్తామని కూడా ప్రకటించింది. మరి ఈ వింతమైన గ్రామం ఎక్కడ ఉందొ తెలుసుకుందాం..!

ఈ విచిత్ర గ్రామం పోలాండ్. చెక్ రిపబ్లిక్ సరిహద్దులోని ఉంది. ఆ గ్రామం పేరు మిజ్స్కే ఓడ్రేజ్ స్కీ. ఇక్కడ గత 10 ఏళ్లుగా ఆడపిల్లలు మాత్రమే జన్మిస్తున్నారు. దీంతో ఈ గ్రామం గురించి పెద్ద చర్చనీయాంశమైంది. మగపిల్లాడు పుడితే..ఆ తల్లిదండ్రులకు బహుమతి ఇస్తామని స్థానిక మేయర్ ప్రకటించడంతో ఈ గ్రామం వార్తల్లో నిలిచింది. అయితే 10 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో ఓక్కమగపిల్లాడు పుట్టాడు.. కానీ ఆ ఫ్యామిలీ గ్రామం విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఈ వింత గ్రామంలో సుమారు 300 మంది నివసిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది మహిళలే.. ప్రతి కుటుంబంలో ఇక్కడ ఆడపిల్లలు మాత్రమే పుట్టడంతో మగవారి సంఖ్య తగ్గిపోతోంది.

ఈక్రమంలో ఎట్టకేలకు గత ఏడాది ఓ మగపిల్లాడు పుట్టాడు. దీంతో ఆ గ్రామం మొత్తం పండగ చేసుకుంది. మగపిల్లాడికి జన్మనిచ్చిన ఆ దంపతులు సెలబ్రెటీలయ్యారు. అయితే ఇక్కడ ఆడపిల్లలను తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. మగపిల్లతో సమానంగా భావించి పెంచుకుంటున్నారు. మిజ్స్కే ఓడ్రేజ్ స్కీ గ్రామంలోని పరిస్థితి ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది . అందరి మనసులో ఉన్న ఒకే ఒఖ్క ప్రశ్న. ఈ గ్రామంలో ఆడపిల్లలు మాత్రమే ఎందుకు పుడుతున్నారు? మగపిల్లలు ఎందుకు పుట్టటంలేదు అని..ఈ మిస్టరీని ఛేదించటానికి చాలా ప్రయత్నాలు చేశారట. అయినప్పటికీ మిస్టరీ వెనుక ఉన్న రీజన్ మాత్రం తెలియలేదని అంటున్నారు.

Also Read: ఇలాంటి ఫుడ్ తినేవారికి ఈజీగా కోవిడ్ రావడం ఖాయం అంటూ ఆరోగ్య నిపుణులు హెచ్చరిక

హోమ్ క్వారంటైన్‌లో కరోనా పేషేంట్స్ ఉన్నారా.. ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి