AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూమ్ యాప్‌లో అనుకోని దృశ్యం.. నగ్నంగా దర్శనమిచ్చిన ఎంపీ.. కంగుతిన్న నేతలు.. వైరల్‌గా మారిన ఫోటో

Canadian MP Caughts: కరోనా పుణ్యామాని మనిషి లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. రాజకీయ నేతలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు.

జూమ్ యాప్‌లో అనుకోని దృశ్యం.. నగ్నంగా దర్శనమిచ్చిన ఎంపీ.. కంగుతిన్న నేతలు.. వైరల్‌గా మారిన ఫోటో
Canadian Mp Caught Naked On Zoom Call
Balaraju Goud
|

Updated on: Apr 16, 2021 | 3:07 PM

Share

Canadian MP Caught Naked: కరోనా పుణ్యామాని మనిషి లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. రాజకీయ నేతలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ముఖ్యమైన సమావేశాలు ఉంటే వీడియో కాన్ఫరెన్స్‌ కోసం ఆన్‌లైన్ మీద ఆధారపడాల్సి వస్తోంది. జూమ్, గూగుల్ మీట్ ద్వారా సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. అయితే, ఇదే క్రమంలో మనషుల వ్యక్తిగత జీవితాలు బహిర్గతమవుతున్నాయి. మీటింగ్ మధ్యలో పిల్లలు రావడం, భార్య రొమాన్స్ చేయడం, నగ్నంగా కనిపించడం వంటి.. ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా కెనడాలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇటీవల హౌజ్ ఆఫ్ కామర్స్ భేటీలో ఎంపీలంతా జూమ్ మీటింగ్‌లో మాట్లాడుతున్నారు. ఇంతలో ఓ ఎంపీ నగ్నంగా ప్రత్యక్షమయ్యాడు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్‌కు చెందిన విలియమ్ ఆమోస్ అనే లిబరల్ పార్టీ ఎంపీ ఆ దేశ కామన్స్‌ కామన్స్ సభ్యుల వర్చువల్ సమావేశం జరిగింది. అందరూ జూమ్ కాల్ ద్వారా కనెక్ట్ అయ్యారు. సభ్యుల ప్రశ్నోత్తరాల సమయం నడుస్తోంది. ఉన్నట్టుండీ, ఆ సమయంలో విలియమ్ ఆమోస్ నగ్నంగా కనిపించారు. తన డెస్క్ వెనకాల కెనడా, క్యూబెక్ జెండాల మధ్యలో ఆయన ఉన్నారు. ఆ దృశ్యాలను చూసి సహచర ఎంపీలు షాక్ తిన్నారు. విషయం తెలుసుకున్న ఎంపీ విలియమ్ ఆమోస్.. వెంటనే కెమెరా ఆఫ్ చేశారు. ఆ తర్వాత దుస్తులు ధరించి తిరిగి సమావేశంలో పాల్గొన్నారు. జరిగిన ఘటన పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.

”అది దురదృష్టవశాత్తు జరిగిన పొరపాటు. జాగింగ్‌కు వెళ్లి వచ్చిన తర్వాత బట్టలు మార్చుకుంటున్న సమయంలో అనుకోకుండా కెమెరా స్విచ్ ఆన్ అయింది. హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యులకు క్షమాపణలు చెబుతున్నా. ఈ తప్పు నా వల్లే జరిగింది. మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటా. ” అని విలియమ్ ఆమోస్ పేర్కొన్నారు.

ఐతే ఎంపీ నగ్నంగా ఉన్న ఫొటో బయటకు రావడంపై దుమారం రేగుతోంది. ఉన్నదంతా ఎంపీలే.. మరి ఆ స్క్రీన్ షాట్ తీసి మీడియాకు ఎవరు పంపించారో అర్ధం కావడం లేదు. హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుల్లో ఒకరు ఈ పని చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీ నేత క్లాడే డిబెల్లెఫ్యయెల్లే మాత్రం ఎంపీ తీరుపై మండిపడుతున్నారు. సమావేశం సమయంలో జాకెట్, టై, షర్ట్, ప్యాంట్ ధరించాలన్న స్పృహ లేకపోవడం విడ్డూరమని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదైమైనా జూమ్ మీటింగ్‌లో ఎంపీ నగ్నంగా కనిపించిన ఘటన కెనాడాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవల సౌతాఫ్రికాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. జూమ్ మీటింగ్‌లో ఉన్న సమయంలో ఓ ప్రజాప్రతినిధి భార్య నగ్నంగా నడుచుకుంటూ వచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. జూమ్‌లో నేషనల్ హౌస్ ఆఫ్ ట్రెడిషనల్ లీడర్స్ అంతా కరోనా గురించి చర్చించుకుంటున్న సమయంలో.. జోలైల్ ఎండీవు భార్య సడెన్‌గా ప్రత్యక్షమయ్యారు. ఆయన వెనకాల నుంచి ఆమె నగ్నంగా నడుచుకుంటూ వచ్చారు. ఆ దృశ్యాన్ని చూసి నేతలంతా షాక్ తిన్నారు. పక్కను నవ్వారు. జోలైల్ ఎండీవుకు ఏం చేయాలో అర్ధం కాలేదు. పరువు తీసింది అన్నట్టుగా.. ముఖానికి చేతులు అడ్డంపెట్టుకున్నారు. కరోనా తర్వాత ఇలాంటి చాలానే జరుగుతున్నాయి.

Read Also….  చేతులు జోడించి క్షమాపణలు చేబుతున్నా.. ఏ మనిషిని నొప్పించాలనుకోలేదు.. తనికెళ్ల భరణి..