Bharat Ratna: ఎంఎస్ స్వామినాథన్‌ను భారతరత్నతో గౌరవించాలి.. కేంద్రానికి తెలంగాణ సర్కారు వినతి

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ భౌతికకాయానికి చెన్నైలో శనివారం మధ్యాహ్నం తమిళనాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బెజంట్ నగర్ ఎలక్ట్రిక్ స్మశానవాటికలో స్వామినాథన్ కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.చెన్నైలోని తరమణిలో డాక్టర్ స్వామినాథన్ భౌతిక ఖాయానికి..

Bharat Ratna: ఎంఎస్ స్వామినాథన్‌ను భారతరత్నతో గౌరవించాలి.. కేంద్రానికి తెలంగాణ సర్కారు వినతి
MS Swaminathan (File Photo)
Follow us
Janardhan Veluru

|

Updated on: Sep 30, 2023 | 4:18 PM

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ భౌతికకాయానికి చెన్నైలో శనివారం మధ్యాహ్నం తమిళనాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బెజంట్ నగర్ ఎలక్ట్రిక్ స్మశానవాటికలో స్వామినాథన్ కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.చెన్నైలోని తరమణిలో డాక్టర్ స్వామినాథన్ భౌతిక ఖాయానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం బెజంట్ నగర్‌లో నిర్వహించిన ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

భారతరత్న అవార్డుతో గౌరవించాలి: తెలంగాణ సర్కారు

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు మరణానంతర భారతరత్న అవార్డుతో గౌరవించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇప్పటికే ఆయనకు దేశ అత్యున్న పౌరపురస్కారం భారతరత్న అవార్డు ఇవ్వడంలో ఆలస్యం జరిగిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా ఆయనకు భారతరత్న ఇవ్వడం ద్వారా శాస్త్రవేత్తలను, ఈ దేశ రైతాంగాన్ని, వ్యవసాయరంగాన్ని గౌరవించినట్లు అవుతుందని అన్నారు. ఎంఎస్ స్వామినాథన్‌కు ఇప్పటికైనా భారతరత్న అవార్డును ఇవ్వాలని తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు.

డాక్టర్ స్వామినాథన్ లాంటి వారు యుగానికొక్కరు పుడతారన్న మంత్రి నిరంజన్ రెడ్డి.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యవసాయ శాస్త్రవేత్త మరణం బాధాకరమన్నారు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ఆకలితో అలమటించి లక్షలాదిమంది చనిపోయిన పరిస్థితిని చూసి చలించి వైద్య విద్యను వదిలేసి వ్యవసాయ విద్యను ఎంచుకుని పరిశోధకుడిగా మారి ప్రపంచ ప్రఖ్యాతిగాంచారని అన్నారు. పరిశోధకుడిగా తిండిగింజలను అందించి ఆకలిని రూపుమాపేందుకు కంకణం కట్టుకున్న శాస్త్రీయ యోధుడంటూ కొనియాడారు. ఈ వందేళ్లకాలంలో  ప్రపంచాన్ని ప్రభావితం చేసిన అతి కొద్దిమందిలోని అద్భుతమయిన శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ అంటూ కొనియాడారు. ఆయన సారధ్యంలో ఏర్పడిన కమీషన్ రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని సూచించిందని గుర్తుచేశారు. కమీషన్ వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, అమలు చేస్తానన్న బీజేపీ ప్రభుత్వం అమలు చేయకుండా రైతాంగానికి అన్యాయం చేసాయని ఆరోపించారు.

MS స్వామినాథన్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలి: మంత్రి నిరంజన్ రెడ్డి(Watch Video)

కొత్త వరి, గోధుమ వంగడాల సృష్టికర్త..

ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు M.S.స్వామినాథన్‌ (98) గురువారం చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. అధిక దిగుబడి ఇచ్చే వరి, గోధుమ వంగడాలు సృష్టించి భారతదేశంలోని రైతుల ఆదాయాన్ని పెంచడంలో ఎంఎస్ స్వామినాథన్ గణనీయమైన కృషి చేశారు. భారత హరిత విప్లవంలో కీలక పాత్ర పోషించారు. డాక్టరు కావాలనుకున్న స్వామినాథన్‌, 1943లో వచ్చిన బెంగాల్‌ దుర్భిక్షం చూసి చలించిపోయి వైద్య విద్యకు స్వస్తిచెప్పి వ్యవసాయ శాస్త్రవేత్తగా మారారు. పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన తర్వాత IPSకు సెలక్ట్‌ అయినా వ్యవసాయ రంగంపై ఆసక్తితో అటువైపే మొగ్గుచూపారు.

పద్మభూషణ్ అవార్డుతో గౌరవించిన ప్రభుత్వం.. 1961లో వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవార్డు అందుకున్నారు. 1969లో భారత ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్‌తో సత్కరించింది. 1971లో ప్రతిష్ఠాత్మక రామన్ మెగసేసే అవార్డు అందుకున్నారు. 1987లో వల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ అందుకున్న తొలి శాస్త్రవేత్త స్వామినాథన్‌.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..