Viral News: యజమానిపై పులి ఆకస్మిక దాడి… కొమ్ములతో ఎగబడ్డ గేదెలు… లగెత్తిన టైగర్..

ఓ పశువుల కాపరిపై పులి అకస్మాత్తుగా దాడికి పాల్పడింది. ఈ క్రమంలో అతను పెంచుతున్న గేదెలే ప్రాణం కాపాడాయి. మధ్యప్రదేశ్ ఉమారియాలోని...

Viral News:  యజమానిపై పులి ఆకస్మిక దాడి... కొమ్ములతో ఎగబడ్డ గేదెలు...  లగెత్తిన టైగర్..
Buffaloes Save Their Master
Follow us

|

Updated on: Apr 08, 2021 | 6:30 PM

ఓ పశువుల కాపరిపై పులి అకస్మాత్తుగా దాడికి పాల్పడింది. ఈ క్రమంలో అతను పెంచుతున్న గేదెలే ప్రాణం కాపాడాయి. మధ్యప్రదేశ్ ఉమారియాలోని ప్రఖ్యాత బాంధవ్‌గఢ్​ టైగర్ రిజర్వ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  బాంధవ్‌గఢ్ పులుల సంరక్షణా కేంద్రానికి దగ్గర్లో నివసించే లల్లూ యాదవ్​ అనే పశువుల కాపరి రోజూలాగానే… ఏప్రిల్ 5న తన గేదెలను మేపడానికి అడవికి వెళ్లాడు. సాయంత్రం సమయంలో దాహం వెయడంతో.. సమీప చెరువులో నీరు తాగేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఒక పులి  సడన్‌గా అతనిపై దాడి చేసింది. తన పంజాలతో బుగ్గలు, భుజాలను రక్కింది.

పులి పంజా దెబ్బకు  నేలమీద వెల్లకిలా పడిపోయిన అతను పెద్దపులి గర్జన విని.. ఈ రోజుతో తన జీవితం అంతం అవుతుందని భావించాడు.  కానీ రెప్పపాటులో ఊహించని దృశ్యాలు లల్లూ యాదవ్ కళ్ల ముందు సాక్షాత్కరించాయి. గేదెలన్నీ పులి చుట్టూ చేరి కొమ్ములతో భయపెడుతూ అతడిపై దాడి చేయకుండా గట్టిగా అరవడం ప్రారంభించాయి. ఈ ఆరు గేదెల నడుమ పెద్దపులి తనను ఏమీ చేయలేకపోయిందని అతడు తెలిపాడు. దాదాపు 10 నిమిషాల అటాక్ చేసేందుకు విశ్వప్రయత్నం చేసిన పులి.. గేదెల తాకిడి తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయిందని అడవిలో జరిగిన సంఘటన గురించి వివరించాడు లల్లూ యాదవ్. పులి దాడిలో స్వల్పంగా గాయపడ్డ లల్లూను మాన్​పుర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేర్చి.. చికిత్స అందించారు. ఈ ఘటన గురించి తెలియగానే గ్రామస్థులంతా ఆశ్యర్యానికి గురయ్యారు.

Also Read: ఈ నీలం అరటిపండ్లను ఎప్పుడైనా తిన్నారా..? టేస్ట్ అచ్చం వెనిలా ఐస్ క్రీమ్ లాగానే..

ఏపీలో కరోనా కల్లోలం.. ఊహించనంతగా పెరిగిన పాజిటివ్ కేసులు, ప్రమాదకరంగా మరణాలు