Andhra Corona Cases: ఏపీలో కరోనా కల్లోలం.. ఊహించనంతగా పెరిగిన పాజిటివ్ కేసులు, ప్రమాదకరంగా మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. రాష్ట్రంలో కొత్తగా 2558 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఆరుగురు మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచారు.

Andhra Corona Cases:  ఏపీలో కరోనా కల్లోలం.. ఊహించనంతగా పెరిగిన పాజిటివ్ కేసులు, ప్రమాదకరంగా మరణాలు
Ap Corona
Follow us

|

Updated on: Apr 08, 2021 | 5:05 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. రాష్ట్రంలో కొత్తగా 2558 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 465, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 37 కేసులు వెలుగుచూశాయి. మరో ఆరుగురు మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచారు. కొవిడ్​తో గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 14913 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా 31268 కొవిడ్ పరీక్షలు చేసినట్లు వైద్యారోగ్య శాఖ గురువారం విడుదల చేసిన బులిటెన్‌లో తెలిపింది. కొత్తగా 915 మంది కరోనా నుంచి కోలుకున్నారు.  కాగా తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 915832కు చేరింది.  తాజా మరణాలతో రాష్ట్రంలో కరోనాతో ప్రాణాలువిడిచిన వారి సంఖ్య 7,268కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,53,33,851 నమూనాలను పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 8,93,651 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

కరోనా కేసుల ఉధృతి పెరిగిన నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. వైరస్‌ను లైట్ తీసుకోవద్దని, అది మరోసారి విజృంభిస్తే ప్రమాదకర పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

దేశంలో కూడా కరోనా కల్లోలం…

భారత్‌లో కరోనావైరస్ విలయతాండవం కొనసాగుతోంది. ఇటీవల రోజువారీ కేసుల సంఖ్య లక్ష మార్కు దాటుతుండటం కలవరపెడుతోంది. తాజగా ఈ కేసుల సంఖ్య లక్షా 26 వేలు దాటడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. గత 24 గంటల్లో బుధవారం దేశవ్యాప్తంగా 1,26,789 కరోనా కేసులు నమోదయ్యారు. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా గత 24గంటల్లో 685 మంది మరణించారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,29,28,574 (1.29 కోట్లు) కు పెరిగింది. దీంతోపాటు మరణించిన వారి సంఖ్య 1,66,862 కు చేరింది.

Also Read: ఈ నీలం అరటిపండ్లను ఎప్పుడైనా తిన్నారా..? టేస్ట్ అచ్చం వెనిలా ఐస్ క్రీమ్ లాగానే..

చీమలు ఎప్పుడూ ఒకే వరుసలో ఎందుకు నడుస్తాయి? దీని వెనుక గల ఇంట్రస్టింగ్ రీజన్ ఇదే..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?