‘ మీరు జర భద్రం ! ‘ ముస్లిములకు మౌల్వీల పిలుపు

కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు అప్పుడే దేశంలో ‘ సంచలనం ‘ సృష్టించబోతున్నట్టు కనిపిస్తోంది. బహుశా అందుకే మొదట కర్నాటకలోని ముస్లిం వర్గాలు అప్రమత్తమవుతున్నాయి. ఆ రాష్ట్రంలోని ఇమామ్ లు, మౌల్వీలు ” మీ.. మీ పౌరసత్వ డాక్యుమెంట్లను సిధ్ధంగా.. అప్-డేట్ చేసి ఉంచుకోవాలంటూ ” ముస్లిములకు పిలుపునిచ్చారు. త్వరలో జాతీయ పౌరుల జాబితా (ఎన్నార్సీ) ని చేపడుతామని హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన నేపథ్యంలో.. ఇందుకు సన్నాహక చర్యగా ముస్లిం మత […]

' మీరు జర భద్రం ! ' ముస్లిములకు మౌల్వీల పిలుపు
Follow us

|

Updated on: Dec 12, 2019 | 3:21 PM

కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు అప్పుడే దేశంలో ‘ సంచలనం ‘ సృష్టించబోతున్నట్టు కనిపిస్తోంది. బహుశా అందుకే మొదట కర్నాటకలోని ముస్లిం వర్గాలు అప్రమత్తమవుతున్నాయి. ఆ రాష్ట్రంలోని ఇమామ్ లు, మౌల్వీలు ” మీ.. మీ పౌరసత్వ డాక్యుమెంట్లను సిధ్ధంగా.. అప్-డేట్ చేసి ఉంచుకోవాలంటూ ” ముస్లిములకు పిలుపునిచ్చారు. త్వరలో జాతీయ పౌరుల జాబితా (ఎన్నార్సీ) ని చేపడుతామని హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన నేపథ్యంలో.. ఇందుకు సన్నాహక చర్యగా ముస్లిం మత గురువులు ఈ పిలుపునిఛ్చినట్టు తెలుస్తోంది. (2024 లో జరిగే లోక్ సభ ఎన్నికల ముందే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని అమిత్ షా స్పష్టం చేశారు).

కాగా… ముస్లిములు తమ డాక్యుమెంట్లలో ఏవైనా తప్పొప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలని తాము కోరుతున్నట్టు బెంగుళూరులోని జామియా మసీదు ఇమామ్ మక్సూద్ ఇమామ్ తెలిపారు. ఈ దేశంలోని ప్రతి పౌరుడూ తమ పౌరసత్వ పత్రాలను అప్-డేట్ చేసి ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో తమ వర్గీయులకు సాయపడేందుకు ఈ నగరంలో మూడు నెలల క్రితమే ఓ సిటిజన్స్ సెంటర్ ఏర్పాటైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే తమ మసీదులో కూడా ఓ కేంద్రం ఉందని ఆయన చెప్పారు. ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ ఐడెంటిటీ కార్డు వంటి వాటిలో తమ పేర్లు, వయస్సు తదితరాలు తప్పుగా ప్రచురితమై ఉంటే.. వాటిని సరిదిద్దుకోవాలని మక్సూద్ పేర్కొన్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్య తలెత్తకుండా ఉంటుందన్నారు.