AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack: దసరా పండుగ వేళ గుండెల్ని పిండేసే వార్త.. 10 రోజుల్లోనే 20 మందికి పైగా గుండెపోటుతో మృతి..

దసరా పండుగ, నవరాత్రుల వేళ గుజరాత్‌లో గుండెపోటు కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. గత 10 రోజుల్లో రాష్ట్రంలో గుండెపోటుతో 20 మందికి పైగా మరణించారు. అహ్మదాబాద్ నగరం, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి కేసులు భారీగా పెగరుతున్నాయి. నవరాత్రి సందర్భంగా గర్బా ఆడుతున్న చాలామంది ఆకస్మాత్తుగా కిందపడి చనిపోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

Heart Attack: దసరా పండుగ వేళ గుండెల్ని పిండేసే వార్త.. 10 రోజుల్లోనే 20 మందికి పైగా గుండెపోటుతో మృతి..
Heart Attack
Shaik Madar Saheb
|

Updated on: Oct 24, 2023 | 4:46 PM

Share

దసరా పండుగ, నవరాత్రుల వేళ గుజరాత్‌లో గుండెపోటు కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. గత 10 రోజుల్లో రాష్ట్రంలో గుండెపోటుతో 20 మందికి పైగా మరణించారు. అహ్మదాబాద్ నగరం, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి కేసులు భారీగా పెగరుతున్నాయి. నవరాత్రి సందర్భంగా గర్బా ఆడుతున్న చాలామంది ఆకస్మాత్తుగా కిందపడి చనిపోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వీరంతా గుండెపోటుకు గురైనట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా కరోనా తర్వాత ఇలాంటి పరిస్థితులు నెలకొన్నట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా తర్వాత అంగరంగ వైభవంగా నవరాత్రి వేడుక జరిగింది. ఈ సమయంలో గర్భా డ్యాన్స్ ఆడుతున్న వారు.. ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురై కేవలం 24 గంటల్లోనే 10 మంది మరణించారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కేసులే నమోదయ్యాయి.

గుజరాత్ లో అప్పట్లో కొన్ని ఎమర్జెన్సీ కేసులు కనిపించాయి. ఈ ఏడాది నవరాత్రి సందర్భంగా గతేడాది కంటే ఎక్కువ ఎమర్జెన్సీ గుండెపోటు కేసులు నమోదయ్యాయి. దీని ప్రకారం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది గుజరాత్‌లో 10 శాతానికి పైగా కేసులు నమోదు కాగా.. అహ్మదాబాద్‌లో 18 శాతానికి పైగా కేసులు నమోదయ్యాయి. అత్యవసర కేసులలో, శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, ప్రమాదకర కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. అందులోనూ గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో గుండె సంబంధిత కేసులు 46 శాతం పెరిగాయి.

గత 6 నెలల్లో 1060 మందికి పైగా గుండెపోటుతో మృతి..

గత 6 నెలల్లో 1 వేయి 60 మందికి పైగా గుండెపోటుతో మరణించారు. అలా అక్టోబరు 22న అంటే ఆదివారం 24 గంటల్లో 13 నుంచి 62 ఏళ్లలోపు 12 మందికి పైగా గుండెపోటుతో మరణించారు. ఇందులో 13 ఏళ్ల చిన్నారితో సహా వడోదరలో 2, జామ్‌నగర్‌లో ముగ్గురు, రాజ్‌కోట్‌లో ముగ్గురు, అహ్మదాబాద్‌లో ఒకరు, సూరత్‌లో ఇద్దరు, కప్ద్వాంజ్‌లో ఒకరు గుండెపోటుతో మరణించారు. ఈరోజు నలుగురు గుండెపోటుతో మరణించారు. రాజ్‌కోట్.. అలాగే ఈరోజు సూరత్‌లో ఒకరు గుండెపోటుతో మరణించారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 590కి పైగా గుండె సంబంధిత కేసులు..

ఒక అంచనా ప్రకారం.. ఈ ఏడాది గుండె జబ్బుల సంఖ్య పెరిగింది. గుజరాత్‌లో గత 10 రోజుల్లో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 590కి పైగా గుండె సంబంధిత కేసులు నమోదయ్యాయి. గర్బా వేదిక సమీపంలో 108 అంబులెన్స్ వాహనాలను మోహరించారు. గర్భా నృత్యం సందర్భంగా గుండెపోటుకు గురైన కేసులను పరిశీలిస్తే.. ఇందులో అహ్మదాబాద్ 139, భావ్‌నగర్ 20, అమ్రేలి 25, గాంధీనగర్ 13, కచ్ 23, సూరత్ 54, రాజ్‌కోట్ 44, వడోదర 29, జామ్‌నగర్ 31, మెహసానా 11, ఖేడా. బనస్కాంత 11, ఆనంద్ 13, సబర్‌కాంత 8, బోటాడ్ 1, పోర్‌బందర్ 8, దేవభూమి ద్వారక 10, దాహోద్ 2 కేసులు నమోదయ్యాయి. అందులోనూ అక్టోబర్ 18, 19 తేదీల్లో 100కు పైగా కేసులు నమోదయ్యాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..