PM Modi: ‘దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో బెంగాల్ పాత్ర కీలకం’.. మహిళా సాధికారతపై మోదీ సందేశం..

| Edited By: Ravi Kiran

May 03, 2024 | 7:24 AM

మూడో దశలో మే 7న నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడత పోలింగ్‌కు ముందు ప్రధాని మోదీ బెంగాల్‌లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ మూడు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. బెంగాల్‌ను సందర్శించే ముందు, ప్రధాని మోదీ టీవీ9కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో కీలక వ్యాఖ్యలు చేశారు. బిజెపి వ్యూహం, దేశ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సామాజిక, ఆర్థిక దృక్కోణంలో దేశానికి చాలా ముఖ్యమైన రాష్ట్రాలు దేశంలో ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు.

PM Modi: దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో బెంగాల్ పాత్ర కీలకం.. మహిళా సాధికారతపై మోదీ సందేశం..
Pm Modi
Follow us on

మూడో దశలో మే 7న నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడత పోలింగ్‌కు ముందు ప్రధాని మోదీ బెంగాల్‌లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ మూడు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. బెంగాల్‌ను సందర్శించే ముందు, ప్రధాని మోదీ టీవీ9కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో కీలక వ్యాఖ్యలు చేశారు. బిజెపి వ్యూహం, దేశ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సామాజిక, ఆర్థిక దృక్కోణంలో దేశానికి చాలా ముఖ్యమైన రాష్ట్రాలు దేశంలో ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఇందులో బెంగాల్ కూడా ఒక రాష్ట్రం అన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో బెంగాల్ పాత్ర ఎంతో ఉంది. రాబోయే కాలంలో కూడా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బెంగాల్ చాలా చేయగలదు. బెంగాల్ చారిత్రక ప్రాధాన్యతను పరిశీలిస్తే, దాని సహకారం మరచిపోలేము. స్వాతంత్ర్య పోరాటంలో బెంగాల్ విప్లవకారులు ముఖ్యపాత్ర పోషించారు, కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే రెండు పార్టీలు బెంగాల్‌ను నాశనం చేశాయి.

వామపక్షాలతో ఏ సమస్యలపై దీదీ పోరాడారో ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వాటినే తిరిగి అవలంబిస్తున్నారన్నారు. గత 50 ఏళ్లలో వామపక్షాలు బెంగాల్‌ను నాశనం చేశాయని ప్రధాని మోదీ అన్నారు. బెంగాల్‌లో చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించారన్నారు. వామపక్షాలకు వ్యతిరేకంగా పోరాడిన టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ ఈ చొరబాటుదారులపై పార్లమెంటులో పేపర్‌ కూడా విసిరిన సంగతి నాకు గుర్తుందని ప్రధాని మోదీ అన్నారు. అప్పుడు లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ ముందు గొడవ జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. నేడు తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ చొరబాటుదారులను వాళ్ల ఓటు బ్యాంకుగా మార్చుకున్నారని మమతా బెనర్జీని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు దేశానికి మంచిది కాదన్నారు. బెంగాల్‌లో 50 శాతం మహిళలు ఓటర్లు, సందేశ్‌ఖాలీ తర్వాత మోడీ హామీ ఏమిటి? అన్న ప్రశ్నకు మోదీ తనదైన శైలిలో బదులిచ్చారు. భారతదేశ జనాభాలో 50 శాతం మందిని అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములను చేయాలన్నది తన ఆలోచన అన్నారు ప్రధాని మోదీ. ఇదే జరిగితే అభివృద్ధి ఊపందుకుంటుందని.. తాను గుజరాత్‌లో ఇలా చేశానన్నారు. తాను గుజరాత్‌లో ఉన్నప్పుడు ఖాదీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానన్నారు. ప్రస్తుతం దీని వ్యాపారం బాగా పెరిగిందన్నారు. 80 శాతం మంది మహిళలు ఖాదీలో పనిచేస్తున్నారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..