PM Modi: టీవీ9పై ప్రసంశలు కురిపించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..

PM Modi: టీవీ9పై ప్రసంశలు కురిపించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..

Srikar T

|

Updated on: May 02, 2024 | 8:39 PM

ప్రధాని మోదీ టీవీ9 కు అభినందనలు తెలిపారు. ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ టీవీ9 అని కొనియాడారు. ఈ విషయం తనకు తెలుసని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. టీవీ9 చూసే వీక్షకుల సంఖ్య కూడా చాలా ఎక్కువ అని కీర్తించారు. ఇదంతా ఒక ఎత్తైతే టీవీ9 డిజిటల్ ఫ్లాట్ ఫాం కూడా చాలా బాగా విస్తరించిందని తెలిపారు. దీనికి ఉదాహరణగా తన అనుభవాన్ని పంచుకున్నారు ప్రధాని మోదీ. తాను ఎప్పుడైనా విదేశాలకు వెళ్లిన సమయంలో తనకు ఏదైనా విషయంలో రెఫరెన్స్ అవసరమైతే వెంటనే టీవీ9 డిజిటల్ ఫ్లాట్ ఫాంలో సర్చ్ చేస్తానని వివరించారు.

ప్రధాని మోదీ టీవీ9 కు అభినందనలు తెలిపారు. ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ టీవీ9 అని కొనియాడారు. ఈ విషయం తనకు తెలుసని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. టీవీ9 చూసే వీక్షకుల సంఖ్య కూడా చాలా ఎక్కువ అని కీర్తించారు. ఇదంతా ఒక ఎత్తైతే టీవీ9 డిజిటల్ ఫ్లాట్ ఫాం కూడా చాలా బాగా విస్తరించిందని తెలిపారు. దీనికి ఉదాహరణగా తన అనుభవాన్ని పంచుకున్నారు ప్రధాని మోదీ. తాను ఎప్పుడైనా విదేశాలకు వెళ్లిన సమయంలో తనకు ఏదైనా విషయంలో రెఫరెన్స్ అవసరమైతే వెంటనే టీవీ9 డిజిటల్ ఫ్లాట్ ఫాంలో సర్చ్ చేస్తానని వివరించారు. దీనికి గల కారణాన్ని కూడా తెలిపారు. టీవీ9 డిజిటల్ వేదికపై సరైన, ఖచ్చితత్వంతో కూడిన విషయాలు ఉంటాయని మోదీ చెప్పారు.

తాను ఇప్పటి వరకు చూసిన, విన్న వాటిలో టీవీ9పై ఎలాంటి దురుద్దేశపూర్వక వార్తలు రాశారని, ప్రసారం చేశారని ఎప్పుడూ వినలేదన్నారు. దేశంలో ఏ మూలనుంచి కూడా ఎలాంటి ఫిర్యాదులు రాకపోవడం చాలా గొప్ప విషయం అన్నారు. బీజేపీ గురించి వ్యతిరేకంగా చాల వార్తలు ప్రసారం చేసి ఉండవచ్చని ఆ విషయంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్న అభిప్రాయాన్ని పంచుకున్నారు. కానీ దేశానికి నష్టం కలిగించే పనులు, వార్తలు, విషయాలు టీవీ9 నెట్వర్క్ ఎప్పుడు చేయలేదని కితాబిచ్చారు. అందుకే ఈ నెట్వర్క్ పట్ల తనకు నమ్మకం అని ఇలాంటి మీడియా దేశానికి చాలా అవసరమని, ఇలాంటివి మరిన్ని ఛానెల్స్ రావాలని భవిష్యత్తులో రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే టీవీ9 నెట్వర్క్ టీం మొత్తానికి తన అభినందనలు తెలియజేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: May 02, 2024 08:27 PM