ముగిసిన ‘మహా’ డ్రామా.. ప్రమాణస్వీకారం చేస్తోన్న ఎమ్మెల్యేలు

కొన్ని రోజులుగా గంటకో ట్విస్ట్‌తో ఆసక్తికరంగా కొనసాగిన మహారాష్ట్ర రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. ఎన్పీసీ, కాంగ్రెస్ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటైన ‘మహా వికాస్‌ అఘాడీ’ నేతగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్ధవ్‌ ఠాక్రేను ఎన్నుకున్నారు. మూడు పార్టీల ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు ముంబయిలోని ట్రైడెంట్‌ హోటల్‌లో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్సీపీ శాసనసభాపక్షనేత జయంతిపాటిల్‌, ఉద్ధవ్‌ పేరును ప్రతిపాదించగా… కాంగ్రెస్‌ సభ్యుడు బాలా సాహెబ్‌ థోరట్‌ […]

ముగిసిన 'మహా' డ్రామా.. ప్రమాణస్వీకారం చేస్తోన్న ఎమ్మెల్యేలు
Follow us

| Edited By:

Updated on: Nov 27, 2019 | 11:26 AM

కొన్ని రోజులుగా గంటకో ట్విస్ట్‌తో ఆసక్తికరంగా కొనసాగిన మహారాష్ట్ర రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. ఎన్పీసీ, కాంగ్రెస్ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటైన ‘మహా వికాస్‌ అఘాడీ’ నేతగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్ధవ్‌ ఠాక్రేను ఎన్నుకున్నారు. మూడు పార్టీల ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు ముంబయిలోని ట్రైడెంట్‌ హోటల్‌లో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్సీపీ శాసనసభాపక్షనేత జయంతిపాటిల్‌, ఉద్ధవ్‌ పేరును ప్రతిపాదించగా… కాంగ్రెస్‌ సభ్యుడు బాలా సాహెబ్‌ థోరట్‌ బలపర్చారు. ఈ నేపథ్యంలో నవంబర్ 28న ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా ప్రస్తుతం ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ప్రొటెం స్పీకర్ కాళిదాస్ కొలంబకర్ ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్సీపీ ఎమ్మెల్యేలలో కలిసి అజిత్ పవార్ అసెంబ్లీకి వచ్చారు. ఇక శాసనసభ వద్ద అజిత్​ పవార్​‌ను శరద్ పవార్ కుమార్తె, ఎన్సీపీ నేత సుప్రియా సూలే ఆప్యాయ ఆలింగనం చేసుకున్నారు. కాగా ఫడ్నవీస్ రాజీనామా చేసిన నేపథ్యంలో బల పరీక్ష అవసరం లేదని విధాన భవన్‌ సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!