ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో అగ్నిప్రమాదం… రోగులు, సిబ్బంది క్షేమం
ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో సోమవారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ఆపరేషన్ థియేటర్ పక్కనే గల ఎమర్జెన్సీ వార్డులో జరిగిన ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.
ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో సోమవారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ఆపరేషన్ థియేటర్ పక్కనే గల ఎమర్జెన్సీ వార్డులో జరిగిన ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఏడు ఫైరింజన్లు మంటలను ఆర్పాయి. తమకు తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో ఈ ఆసుపత్రి నుంచి కాల్ అందిందని, వెంటనే ఫైరింజన్లను పంపామని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. కాగా ఈ వార్డులోని రోగులను తక్షణమే అక్కడి నుంచి ఖాళీ చేయించినట్టు ఆ తరువాత పోలీసు అధికారులు చెప్పారు. రోగులు గానీ, ఆసుపత్రి సిబ్బంది గానీ గాయపడలేదని వారు వెల్లడించారు. పైగా రోగులను క్యాజువాలిటీ ఏరియాకు అనుమతించామన్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి కారణం తెలియలేదు. బహుశా షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు. ఏమైనా ఈ ఘటన రోగులను, సిబ్బందిని షాక్ కి గురి చేసింది. గతంలో కూడా ఎయిమ్స్ లో అగ్నిప్రమాదాలు జరిగాయి.
జూన్ 21 న జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో కోవిద్ ల్యాబ్ పూర్తిగా దగ్ధమైంది. అలాగే స్టోర్ రూమ్ లోని కొన్ని రికార్డులు కూడా కాలిపోయాయి. 26 అగ్నిమాపక శకటాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. కాగా 2019 ఆగస్టులో జరిగిన ప్రమాదంలో మంటలను అదుపు చేసేందుకు 34 ఫైరింజన్లను వినియోగించారు. మంటలు పూర్తిగా అదుపులోకి రావడానికి ఆరు గంటలకు పైగా సమయం పట్టింది. ఆ ఘటనలను దృష్టిలో పెట్టుకుని అత్యంత జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అయినా సోమవారం ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడం ఆసుపత్రి యాజమాన్యాన్ని కలవరపరుస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Brahmaji: చైనా అధ్యక్షుడిని కలిసిన బ్రహ్మాజీ.. మా ఎన్నికలపై చర్చ.. వైరల్‌గా మారిన ఇన్‌స్టా పోస్ట్..