‘ఆది కర్మయోగి అభియాన్’ పథకం ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వ శాఖ.. విజన్ 2030కి భారీ ప్రణాళికలు
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన గ్రాస్‌రూట్స్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్ అయిన ఆది కర్మయోగి అభియాన్‌ను కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల సాధికారత కల్పించడం, ప్రతిస్పందనాత్మక పాలనను బలోపేతం చేయడం, స్థానిక నాయకత్వ అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ దార్శనికతో ప్రారంభించిన ఈ పథకం...

న్యూఢిల్లీ, ఆగస్టు 19: కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆది కర్మయోగి అభియాన్‌ను అధికారికంగా ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన గ్రాస్‌రూట్స్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల సాధికారత కల్పించడం, ప్రతిస్పందనాత్మక పాలనను బలోపేతం చేయడం, స్థానిక నాయకత్వ అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ దార్శనికతో ప్రారంభించిన ఈ పథకం ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ (సేవ, పరిష్కారం, సమర్పణ)’ అనే సూత్రాన్ని ప్రతిబింబించేలా రూపొందిచారు. ఈ చొరవ జనజాతీయ గౌరవ వర్ష్‌లో కీలకమైన భాగంకానుంది. 2047 నాటికి విక్షిత్ భారత్ నిర్మాణానికి ఇది దోహదపడుతుంది.
ఆది కర్మయోగి అభియాన్ లక్ష్యాలు ఇవే..
- గ్రామం, సమాజ స్థాయిలో ప్రతిస్పందనాత్మక, ప్రజల-కేంద్రీకృత పాలనను ప్రోత్సహించడం.
- జూలై 10, 2025 నుంచి కొనసాగుతున్న రాష్ట్ర, జిల్లా, బ్లాక్ మాస్టర్ ట్రైనర్ల సామర్థ్య పెంపు కోసం రాష్ట్రం నుంచి జిల్లా, బ్లాక్, గ్రామ స్థాయిల్లో బహుళ-విభాగ పాలన ల్యాబ్ వర్క్‌షాప్‌లు, ప్రాసెస్ ల్యాబ్‌లను నిర్వహించడం.
- గిరిజన సంఘాలు, ప్రభుత్వ అధికారులు సంయుక్తంగా విజన్ 2030లో భాగంగా లక్ష గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు, పెట్టుబడి వ్యూహాలను రూపొందించడం.
- అట్టడుగు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడానికి 550 జిల్లాలు, 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 20 లక్షల మంది లీటర్లతో నెట్‌వర్క్‌ను నిర్మించడం ద్వారా 10.5 కోట్ల గిరిజన పౌరులకు లబ్ధి చేకూర్చడం.
ఆది కర్మయోగి అభియాన్ ప్రత్యేక కార్యక్రమాలు
- ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రాలను గిరిజనులు ఎక్కువగా నివసించే అన్ని గ్రామాలలో అమలు చేయనున్నారు. ఇక్కడ ప్రభుత్వ అధికారులు, సమాజ సభ్యుల సహకారంతో స్థానిక సమస్యలను పరిష్కరించడానికి, యువతకు మార్గదర్శకత్వం వహించడానికి, పాలనా చొరవలకు మద్దతు ఇవ్వడానికి రోజుకు 1 నుంచి 2 గంటల వరకు పని చేయనున్నారు.
- గవర్నెన్స్ ల్యాబ్ వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇవి రాష్ట్రం నుంచి గ్రామ స్థాయిల వరకు నిర్మాణాత్మక ప్రక్రియ ప్రయోగశాలలు, గిరిజన అభివృద్ధికి తగిన పరిష్కారాలను రూపొందించడానికి బహుళ విభాగాలను నిమగ్నం చేస్తాయి.
- గిరిజన గ్రామ కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, సమగ్ర అభివృద్ధి వైపు జాతీయ, అంతర్జాతీయ నిబద్ధతలకు అనుగుణంగా గిరిజన గ్రామ విజన్ 2030ని గ్రామస్తులు, అధికారులు కలిసి రూపొందిస్తారు.
ఉపాధ్యాయులు, వైద్యులు, కమ్యూనిటీలకు మార్గదర్శకత్వం వహించేందుకు సహకరిస్తారు. అలాగే స్వయం సహాయక సంఘాలు, NRLM సభ్యులు, గిరిజన పెద్దలు, యువత, స్థానిక నాయకులు ఈ పథఖం అమలు, వ్యాప్తికి మద్దతు ఇస్తున్నారు. అలాగే గిరిజన యువత, మహిళలు, కమ్యూనిటీ నాయకులకు పాలన, సమస్య పరిష్కారం, సామాజిక సమీకరణపై కమ్యూనిటీ లీడర్‌షిప్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 550 జిల్లాల నుంచి దాదాపు లక్ష గిరిజన ప్రాబల్య గ్రామాలకు ఈ కార్యక్రమాలను చేరవేసేందుకు కృషి చేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొన్ని విజయవంతమైన ప్రభుత్వ పథకాల అమలుపై ఆధారపడి ఉంటుంది. ఇందులో ధర్తి ఆబా జంజాటియ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకం, ప్రధాన మంత్రి జంజాటి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (PM JANMAN), జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ పథకాలు ముఖ్యమైనవి. దేశవ్యాప్తంగా గిరిజన నాయకత్వాన్ని, సమగ్ర అభివృద్ధిని బలోపేతం చేసేందుకు ఈ చారిత్రాత్మక చొరవలో చురుకుగా పాల్గొనాలని గిరిజన సంఘాలు, యువత, స్వయం సహాయక సంఘాలు, పౌర సమాజం, ప్రభుత్వ అధికారులకు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
ఆది కర్మయోగి అభియాన్ అనేది సమ్మిళిత పాలన, ప్రజల భాగస్వామ్యాన్ని సాధించడంలో ఓ చారిత్రాత్మక అడుగుగా గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ జువల్ ఓరం అభివర్ణించారు. సేవా, సంకల్ప్, సమర్పణ్‌లను పెంపొందించడం ద్వారా గిరిజన సంఘాలు, ప్రభుత్వ అధికారుల సహకారం ద్వారా 1 లక్ష గిరిజన గ్రామాల విజన్ 2030ని సృష్టిస్తామని అన్నారు. ఈ చొరవ అట్టడుగు స్థాయిలో ఉన్న గిరిజన అభివృద్ధికి పరివర్తన కలిగించే సామర్థ్యాన్ని కలిగిస్తుందని, మిషన్ మోడ్‌లో గిరిజన గ్రామాల సమగ్ర అభివృద్ధిని సాధించడంలో సహాయపడుతుందని గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయ్కే పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




