AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19: కోవిడ్‌-19 ఆంక్షలు జూన్‌ 30 వరకు కొనసాగించాలి.. రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర హోంశాఖ

Covid-19: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అయితే కోవిడ్‌ మార్గదర్శకాలను జూన్‌ 30 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. కరోనా కేసులు ఎక్కువగా..

Covid-19: కోవిడ్‌-19 ఆంక్షలు జూన్‌ 30 వరకు కొనసాగించాలి.. రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర హోంశాఖ
Subhash Goud
|

Updated on: May 28, 2021 | 10:41 AM

Share

Covid-19: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అయితే కోవిడ్‌ మార్గదర్శకాలను జూన్‌ 30 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. అయితే దక్షిణ, ఈశాన్యంలోని పలు ప్రాంతాలకు మినహాయింపును ఇచ్చింది. స్థానిక పరిస్థితులు, అవసరాలు, వనరులను అంచనా వేసిన తర్వాత రాష్ట్రాలు, యూటీలు ఏదైనా సడలింపులను తగిన సమయంలో, గ్రేడెడ్‌ పద్ధతిలో పరిగణించవచ్చని రాష్ట్రాలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏప్రిల్‌ 29న జారీ చేసిన మార్గదర్శకాలు జూన్‌ 30 వరకు కొనసాగుతాయని వెల్లడించారు. మార్గదర్శకాల మేరకు ఆక్సిజన్‌, ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు, తాత్కాలిక ఆసుపత్రుల ఏర్పాటుతో పాటు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఐసోలేషన్‌ వసతులతో పాటు అవసరమైన చర్యలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు సూచించింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, ఇలాగే ఆంక్షలు జూన్‌ 30 వరకు కొనసాగిస్తే మరిన్ని కేసులు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. అయితే, తాజా మార్గదర్శకాల్లో లాక్‌డౌన్‌పై హోంశాఖ ఎలాంటి ప్రస్తావన చేయలేదు.

ఈ సందర్భంగా హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా మాట్లాడుతూ .. కొత్త కరోనా కేసులు తగ్గుతున్నాయని, ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉందన్నారు. ఈ మేరకు కోవిడ్‌ నియంత్రణ చర్యలు తప్పకుండా కొనసాగించాలని ఆయన అన్నారు. కరోనా కట్టడి కావాలంటే ఆంక్షలు సడలించరాదని, నియంత్రణ చర్యలు చేపట్టాలని అన్నారు. కోవిడ్‌ నియంత్రణ చర్యలు చేపట్టడం వల్ల కేసులు ఈ స్థాయికి వచ్చాయని, లేకపోతే మరింత ప్రమాదం పొంచివుండే అవకాశం ఉండేదన్నారు.

ఇవీ కూడా చదవండి:

Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు మే 31 నాటికి కేరళను తాకే అవకాశం: భారత వాతావరణ శాఖ

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. ఆందోళన కలిగిస్తోన్న మరణాలు.. కొత్తగా ఎన్నంటే.!