Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యపై అనుమానం.. బాయ్ ‌ఫ్రెండ్ ఇంటికెళ్లి బ్యాగ్‌తో బయలుదేరిన భర్త.. ఆ తర్వాత..

ఉత్తరప్రదేశ్‌లోని హరాన్‌పూర్‌కు చెందిన మహ్మద్ ఆరిఫ్ (38), సైనాబా (27) భార్యాభర్తలు.. దంపతులిద్దరూ కేరళలోని వాయనాడ్ ప్రాంతానికి వలస కార్మికులుగా వచ్చి చిన్నాచితకా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే తన భార్యతో ముగీబ్ అహ్మద్‌ అనే మరో వ్యక్తి సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకున్నాడని ఆరిఫ్‌కు అనుమానం మొదలైంది. ఈ విషయంలో పలుమార్లు భార్యాభర్తల మధ్య గొడవలు కూడా జరిగాయి..

భార్యపై అనుమానం.. బాయ్ ‌ఫ్రెండ్ ఇంటికెళ్లి బ్యాగ్‌తో బయలుదేరిన భర్త.. ఆ తర్వాత..
Crime News
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Shaik Madar Saheb

Updated on: Feb 02, 2025 | 1:45 PM

అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, గొడవలు.. తీరా దాని నుంచి బయటపడాలని హత్యలు, దారుణాలు చేయడం ఈ మధ్య తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్ నగరంలోని మీర్ పేట్ ప్రాంతంలో భార్యను అతి కిరాతకంగా హత్య చేసి, ముక్కలుగా నరికి, పొడి చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ దారుణ ఘటన మరువక ముందే మరో భర్త ఉదంతం వెలుగులోకి వచ్చింది. తన భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చాడు ఓ వ్యక్తి.. ఈ ఘటన కలకలం రేపింది.. ఉత్తరప్రదేశ్‌లోని హరాన్‌పూర్‌కు చెందిన మహ్మద్ ఆరిఫ్ (38), సైనాబా (27) భార్యాభర్తలు.. దంపతులిద్దరూ కేరళలోని వాయనాడ్ ప్రాంతానికి వలస కార్మికులుగా వచ్చి చిన్నాచితకా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే తన భార్యతో ముగీబ్ అహ్మద్‌ అనే మరో వ్యక్తి సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకున్నాడని ఆరిఫ్‌కు అనుమానం మొదలైంది. ఈ విషయంలో పలుమార్లు భార్యాభర్తల మధ్య గొడవలు కూడా జరిగాయి.. ఎన్నిసార్లు చెప్పినా భార్య తన పద్దతి మాత్రం మార్చుకునేది కాదు. ఇలా కొన్ని రోజులు గొడవల తర్వాత ప్రియుడు ముగీబ్ ను ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు ఆ కసాయి భర్త. ఎలా చంపాలనే దానిపై మంచిగా ప్లాన్ కూడా రచించాడు.. అనంతరం అతడిని దారుణంగా చంపాడు.. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా సంచలన విషయాలు బయటికి వచ్చాయి. దీంతో శనివారం మహ్మద్ ఆరిఫ్‌, సైనాబాలను వాయనాడ్ పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆరిఫ్ ముగీబ్‌ను.. మహ్మద్ ఆరిఫ్ పథకం ప్రకారం అతను ఉండే చోటు తెలుసుకున్నాడు. ముందుగా అనుకున్నట్లుగా ఆరిఫ్ ను చంపేసి ఆపై అతని శరీరాన్ని రెండు ముక్కలుగా నరికాడు. ఆపై అతని మృతదేహాన్ని దూరంగా ఉన్న ఓ పాడుబడిన ప్రదేశంలో పడేశాడు.. అయితే.. ఇక్కడ ఆరిఫ్ చేసిన తప్పిదం ఏంటంటే.. మృతదేహాన్ని దూరంగా తరలించాలనే ఉద్దేశ్యంతో ఓ ఆటోని కిరాయికి మాట్లాడుకున్నాడు. అనుకున్నట్టుగానే వెళ్ళిపోయాడు. కానీ, తన వాహనంలో రక్తపు మరకలు ఉన్నాయని ఆటో డ్రైవర్‌కు అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు అనుమానం వచ్చి ఆరీఫ్‌, సైనాబాలను అదుపులోకి తీసుకుని విచారించగా.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను చెప్పి.. చేసిన తప్పును ఒప్పుకున్నారు. ప్రస్తుతం వయనాడ్ పోలీసులు ఈ కేసుపై తదుపరి విచారణను కొనసాగిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..