Watch: షాకింగ్ ఘటన.. ఎంపీల నివాసంలో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని ఢిల్లీలోని బిడి మార్గ్‌లో ఉన్న ఎంపీల నివాస సముదాయంలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అపార్ట్‌మెంట్‌లోని ఒక అంతస్తులోఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్రిప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

దేశ రాజధాని ఢిల్లీలోని బిడి మార్గ్‌లోని ఉన్న బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాంప్లెక్స్‌లోని పై అంతస్తులలో ఒకదానిలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో నివాసితులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే ఫైర్ సిబ్బంది కాస్తా ఆలస్యంగా ఘటనా స్థలానికి చేరుకొన్నారు. అప్పటికే మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఇక రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
అయితే ఈ బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్ ఎంపీల నివాస సముదాయంగా కొనసాగున్నాయి. ఇందులో అనేక మంది లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు నివాసం ఉంటున్నారు. 2020లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అపార్ట్‌మెంట్‌ను ప్రారంభించారు. పార్లమెంటు నుండి కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్న బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్, పార్లమెంటు సభ్యులకు కేటాయించిన అధికారిక నివాసాలలో ఒకటి.
ఇదిలా ఉండగా ప్రమాద ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలంలో అందుబాటులో లేకపోవడంపై మండిపడ్డారు. ఢిల్లీలోని బిడి మార్గ్‌లోని బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నివాసితులందరూ రాజ్యసభ ఎంపీలే. ఆ భవనం పార్లమెంటు నుండి 200 మీటర్ల దూరంలో ఉంది. 30 నిమిషాల నుండి అగ్నిమాపక సిబ్బంది లేరు. మంటలు ఇంకా మండుతూనే ఉన్నాయి. పదే పదే కాల్స్ చేసినప్పటికీ అగ్నిమాపక యంత్రాలు కనిపించడం లేదని ఆయన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
#WATCH | A fire broke out at Brahmaputra Apartments in New Delhi. Six vehicles have been dispatched to the spot
More details awaited pic.twitter.com/eEk0UUyZzU
— ANI (@ANI) October 18, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




