AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Man Vs Wild: ప్రధాని మోదీ సాహస యాత్ర..పూర్తి విశేషాలు

Man vs Wild: ప్రముఖ సాహసవీరుడు బేర్ గ్రిల్స్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సాహసాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. డిస్కవరీ ఛానెల్ ప్రసారం చేసిన “మేన్ వర్సెస్ వైల్డ్”ను కోట్లాది మంది భారతీయులు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో తన బాల్యానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ప్రధాని మోదీ బేర్ గ్రిల్స్‌తో పంచుకున్నారు. తన చిన్నతనంలో మురికి బట్టలనే ధరించేవాడినని..స్కూల్‌కు మాత్రం నీట్‌గా వెళ్లేవాడినని చెప్పారు. రాగి చెంబులో నిప్పులు వేసి దుస్తులను ఇస్త్రీ […]

Man Vs Wild: ప్రధాని మోదీ సాహస యాత్ర..పూర్తి విశేషాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 13, 2019 | 5:38 AM

Share

Man vs Wild: ప్రముఖ సాహసవీరుడు బేర్ గ్రిల్స్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సాహసాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. డిస్కవరీ ఛానెల్ ప్రసారం చేసిన “మేన్ వర్సెస్ వైల్డ్”ను కోట్లాది మంది భారతీయులు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో తన బాల్యానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ప్రధాని మోదీ బేర్ గ్రిల్స్‌తో పంచుకున్నారు. తన చిన్నతనంలో మురికి బట్టలనే ధరించేవాడినని..స్కూల్‌కు మాత్రం నీట్‌గా వెళ్లేవాడినని చెప్పారు. రాగి చెంబులో నిప్పులు వేసి దుస్తులను ఇస్త్రీ చేసుకునేవారమని గుర్తు చేసుకున్నారు.

[svt-event title=”ప్రధాని సాహసయాత్ర” date=”12/08/2019,10:19PM” class=”svt-cd-green” ] ముగిసిన ప్రధాని సాహస యాత్ర [/svt-event]

[svt-event title=”ప్రధాని మోదీ సాహస యాత్ర” date=”12/08/2019,10:17PM” class=”svt-cd-green” ] ప్రధాని తడిచిపోయారు. ఆయన శరీరం అంతా చల్లగా మారిపోయింది. ఆయన నిజమైన హీరో అన్న బేర్ [/svt-event]

[svt-event title=”బేర్ శుభాకాంక్షలు” date=”12/08/2019,10:16PM” class=”svt-cd-green” ] ప్రధాని మోదీ, ఇండియా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటునానన్న బేర్ [/svt-event]

[svt-event title=”ప్రధాని సాహసయాత్ర” date=”12/08/2019,10:14PM” class=”svt-cd-green” ] ఇండియాలో పర్యాటకం, జంతుజాలం ప్రపంచం చూడదగ్గవన్న మోదీ [/svt-event]

[svt-event title=”ప్రధాని మోదీ సాహస యాత్ర” date=”12/08/2019,10:12PM” class=”svt-cd-green” ] ఇదో గొప్ప అనుభూతి. ఈ ఎపిసోడ్ ద్వారా భారత్ పట్ల ప్రపంచానికి సానుకూల దృక్పదం ఏర్పడుతుందని భావిస్తునన్న మోదీ [/svt-event]

[svt-event title=”బేర్‌తో ప్రధాని సంభాషణ” date=”12/08/2019,10:01PM” class=”svt-cd-green” ] బేర్‌తో కలిసి ట్యూబ్‌పై సరస్సును దాటిన మోదీ [/svt-event]

[svt-event title=”బేర్‌తో ప్రధాని సంభాషణ” date=”12/08/2019,9:58PM” class=”svt-cd-green” ] ప్రకృతిని నాశనం చేస్తున్నవారు భవిష్యత్ తరాలను గుర్తుకు తెచ్చుకోవాలన్న మోదీ [/svt-event]

[svt-event title=”బేర్‌తో ప్రధాని సంభాషణ” date=”12/08/2019,9:55PM” class=”svt-cd-green” ] భారత్‌లో పారిశుధ్యం మరియు పరిశుభ్రత విషయాల్లో కీలక మార్పులు తెచ్చామన్న మోదీ [/svt-event]

[svt-event title=”బేర్‌తో ప్రధాని సంభాషణ” date=”12/08/2019,9:49PM” class=”svt-cd-green” ] మనుషులు స్వార్దపూరిత ప్రయోజనాల కోసం ప్రకృతిని నాశనం చేస్తున్నారన్న మోదీ [/svt-event]

[svt-event title=”బేర్‌తో ప్రధాని సంభాషణ ” date=”12/08/2019,9:48PM” class=”svt-cd-green” ] భారతదేశంలో ప్రతి మొక్కను దేవుడిలా భావిస్తామని బేర్‌తో చెప్పిన మోదీ [/svt-event]

[svt-event title=”బేర్‌తో ప్రధాని సంభాషణ” date=”12/08/2019,9:45PM” class=”svt-cd-green” ] నా జీవితంలో ఎప్పుడూ భయాన్ని, అసహనాన్ని ఎదర్కోలేదన్న మోదీ [/svt-event]

[svt-event title=”బేర్‌తో ప్రధాని సంభాషణ” date=”12/08/2019,9:43PM” class=”svt-cd-green” ] చిన్నతనంలో ఓ సరస్సు వద్ద నేను స్నానం చేస్తుండేవాడిని. ఒకసారి అలా స్నానం చేస్తుండగా ఒక మొసలి పిల్ల కనిపించింది. దాన్ని ఇంటికి తీసుకువెళ్లాలనుకున్నాను [/svt-event]

[svt-event title=”బేర్‌తో ప్రధాని సంభాషణ” date=”12/08/2019,9:42PM” class=”svt-cd-green” ] ప్రకృతి భయానకమైనది అని ఎప్పుడూ అనుకోకూడదు [/svt-event]

[svt-event title=”బేర్‌తో ప్రధాని సంభాషణ” date=”12/08/2019,9:41PM” class=”svt-cd-green” ] తాను చేస్తున్న పనిని తప్ప హోదాని పట్టించుకోన్న మోదీ [/svt-event]

[svt-event title=”ప్రధాని మోదీ సాహసాలు” date=”12/08/2019,9:34PM” class=”svt-cd-green” ] పర్యావరణం మనుషుల జీవితాల్లో భాగమన్న ప్రధాని మోదీ [/svt-event]

[svt-event title=”ప్రధాని మోదీ సాహసాలు” date=”12/08/2019,9:33PM” class=”svt-cd-green” ] తాను చిన్నప్పుడు ఎదుర్కోన్న కష్టాలను, సవాళ్లను బేర్‌కు వివరిస్తున్న ప్రధాని మోదీ [/svt-event]

[svt-event title=”ప్రధాని మోదీ సాహసాలు” date=”12/08/2019,9:14PM” class=”svt-cd-green” ] బేర్: ఇండియా మరింత పరిశుభ్రంగా మారడానికి మేమేం చెయ్యాలని మీరు అనుకుంటున్నారు.

మోడీ: ఇండియా పరిశుభ్రంగా ఉండటానికి, బయటి దేశాల సాయం అవసరం లేదు. భారతదేశ ప్రజల స్వభావంతో ఇండియా క్లీన్ అవుతుంది. వ్యక్తిగత శుభ్రత ఇక్కడ ప్రతి ఒక్కరి సంస్కారంలోనూ ఉంది. సమాజంలో స్వచ్చతపై అందరిలోనూ అవగాహన ఉంది. మహాత్మా గాంధీ ఇందుకోసం చాలా కృషి చేశారు. స్వచ్చ భారత్‌‌ సఫలమవుతోంది. [/svt-event]

[svt-event title=”ప్రధాని మోదీ సాహసాలు” date=”12/08/2019,9:27PM” class=”svt-cd-green” ] జంతువులను చంపడానికి వస్తే ఎలా రక్షించుకోవాలో మోడీకే పాఠాలు నేర్పాలని బేర్‌ ట్రై చేస్తే, చంపడం నా తల్లిదండ్రులు తనకు నేర్పలేదని, తిరిగే బేర్‌కు పాఠం చెప్పారు మోడీ. ఆ మాటకు బేర్‌ను కూడా ఆలోచనలో పడేసింది. ఇలా చెట్లు, పుట్టలు దాటుకుంటూ, బేర్‌ను అనుసరిస్తూ ముందుకు సాగిపోయారు మోడీ. నది దగ్గరకు చేరుకున్నారు. [/svt-event]

[svt-event title=”ప్రధాని మోదీ సాహసాలు” date=”12/08/2019,9:26PM” class=”svt-cd-green” ]

బేర్: మీరు భారతదేశానికి చాలా ముఖ్యమైన వ్యక్తి. మిమ్మల్ని కాపాడ్డమే నా పని.

బేర్: పులి మీదికి వస్తే, దీనితో ఇలా పొడిచి మనల్ని రక్షించుకోవాలి.

మోడీ: అయితే, చంపడం నా సంస్కారం కాదు. మీ కోసం ఈ ఆయుధాన్ని నా దగ్గర పెట్టుకుంటాను. [/svt-event]

[svt-event title=”ప్రధాని మోదీ సాహసాలు” date=”12/08/2019,9:21PM” class=”svt-cd-green” ] మోడీ: ఓహో. ఇదేనా నీ వెపన్.

బేర్: కర్ర, కత్తిని కేర్‌ఫుల్‌గా పట్టుకోండి. తాడు అలానే తిప్పుతూ ఉండండి. మీరు యువకునిగా ఉన్నప్పుడు, పర్వతాల్లో ఎక్కువగా గడిపారట.

మోడీ: అవును. హిమాలయాల్లో కొన్నాళ్లు ఉన్నాను.

బేర్: ఆ అనుభవాలు ఒకసారి చెప్పండి. మోడీ:

నా వయస్సు 17, 18 ఏళ్లు ఉన్నప్పుడు నేను ఇంట్లోంచి వచ్చేశాను. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అని ఆలోచించాను. ప్రకృతి అంటే నాకెంతో ఇష్టం. హిమాలయాల్లో చాలామందిని కలిశాను. వారి మధ్యనే గడిపాను. అదొక విశేషమైన అనుభవం. చాలా సమయం అక్కడ గడిపాను. [/svt-event]

[svt-event title=”ప్రధాని మోదీ సాహసాలు” date=”12/08/2019,9:20PM” class=”svt-cd-green” ] అడవిలో క్రూర జంతువలు ఉంటాయి కాబట్టి, ఆయుధాలు అవసరమని మోడీకి చెప్పాడు బేర్. ఆత్మరక్షణ కోసం అప్పటికప్పుడు, అక్కడే దొరికే కర్రలు, పనిముట్లతో బలమైన ఆయుధం ఎలా తయారు చేసుకోవచ్చో మోడీకి చెప్పే ప్రయత్నం చేశాడు. ఇద్దరూ కలిసి, వెపన్‌ను తయారు చేశారు. ఆ సందర్భంలో ఇద్దరి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. [/svt-event]

[svt-event title=”ప్రధాని మోదీ సాహసాలు” date=”12/08/2019,9:18PM” class=”svt-cd-green” ] మోడీ: భారతదేశానికి స్వాగతం.

బేర్: ప్రైమ్‌ మినిస్టర్‌, ఇది వన్యప్రాణి సంరక్షణా ప్రాంతం, నేషనల్ పార్క్ అని మీకు తెలుసు. ఇది చాలా ప్రమాదకరమైన స్థలమని కూడా మీకు తెలుసు. ఎన్నో వన్యప్రాణులున్నాయి ఇక్కడ. ఇందులో వాహనాలతో వచ్చే సందర్శకులు ఎవరూ కూడా, వాహనం దిగడానికి సాహసించలేని ప్రమాదకర స్థలం. [/svt-event]

[svt-event title=”బేర్‌తో ప్రధాని సంభాషణ” date=”12/08/2019,10:09PM” class=”svt-cd-green” ] మోదీ: నేను అత్యంత పేద కుటుంబంలో పుట్టాను. కనీసం బట్టలు ఉతకడానికి, స్నానం చెయ్యడానికి ఇంట్లో సబ్బులు కూడా లేని పరిస్థితి చూశాను. కానీ గొప్పగా చదవుకోలేదు [/svt-event]

[svt-event title=”మోదీ సాహస యాత్ర” date=”12/08/2019,10:05PM” class=”svt-cd-green” ] మోదీ: మొదటిసారి భారత్‌కు వచ్చినందుకు శుభాకాంక్షలు

బేర్: సారీ ప్రధాని మంత్రి నాకు 18 ఏళ్లు ఉన్నప్పుడు భారత్‌ను సందర్శించారు [/svt-event]

[svt-event title=”Man Vs Wild: ప్రధాని మోదీ సాహసాలు” date=”12/08/2019,9:11PM” class=”svt-cd-green” ] అడవిలో ప్రారంభమైన ప్రధాని మోదీ సాహస యాత్ర [/svt-event]