బక్రీద్.. అసలైన త్యాగమంటే ఇదే..

సాయం చేయాలని అందరికీ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు అందరూ ఏదోఒక రూపంలో తోటివారికి తమవంతు సహాయం అందిస్తూనే ఉంటారు. ఇక ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, అనుకోని ఉపద్రావలు ముంచుకొచ్చినప్పుడు బాధితులకు చేసే ప్రతి సాయం ఎంతో విలువైనది. అటువంటి అత్యంత విలువైన సహాయం చేశాడు కేరళకు చెందిన ఓ యువకుడు. ఎర్నాకుళంలోని నౌషాద్ అనే వస్త్ర వ్యాపారి ఏకంగా తన దుకాణంలోని స్టాక్ మొత్తాన్ని వరద బాధితులకు అంకితం చేశాడు. బక్రీద్ పండగను పురస్కరించుకుని నౌషాద్ చేసిన […]

  • Anil kumar poka
  • Publish Date - 6:26 pm, Mon, 12 August 19
బక్రీద్.. అసలైన త్యాగమంటే ఇదే..

సాయం చేయాలని అందరికీ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు అందరూ ఏదోఒక రూపంలో తోటివారికి తమవంతు సహాయం అందిస్తూనే ఉంటారు. ఇక ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, అనుకోని ఉపద్రావలు ముంచుకొచ్చినప్పుడు బాధితులకు చేసే ప్రతి సాయం ఎంతో విలువైనది. అటువంటి అత్యంత విలువైన సహాయం చేశాడు కేరళకు చెందిన ఓ యువకుడు. ఎర్నాకుళంలోని నౌషాద్ అనే వస్త్ర వ్యాపారి ఏకంగా తన దుకాణంలోని స్టాక్ మొత్తాన్ని వరద బాధితులకు అంకితం చేశాడు. బక్రీద్ పండగను పురస్కరించుకుని నౌషాద్ చేసిన సహాయం నిజంగా త్యాగానికి ప్రతీకగా నిలుస్తోందంటున్నారు అది తెలిసిన వారందరు.