Punjab: స్నేహితురాలిని హత్య చేసి.. ఆమె కారులో పారిపోయేందుకు యత్నం! సినిమాను తలపించే ట్విస్ట్..
ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న తన స్నేహితురాలిని కత్తితో పొడిచి ఓ వ్యక్తి హత్య చేశాడు. అనంతరం ఆమె కారులో పారిపోయేందుకు యత్నించాడు. అయితే అనుకోని విధంగా రోడ్డు ప్రమాదానికి గురై పోలీసులకు దొరికిపోయాడు. ఈ దారుణ ఘటన పంజాబ్‌లోని మొహాలి జిల్లాలో సోమవారం (ఏప్రిల్ 8) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

చండీగడ్, ఏప్రిల్ 8: ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న తన స్నేహితురాలిని కత్తితో పొడిచి ఓ వ్యక్తి హత్య చేశాడు. అనంతరం ఆమె కారులో పారిపోయేందుకు యత్నించాడు. అయితే అనుకోని విధంగా రోడ్డు ప్రమాదానికి గురై పోలీసులకు దొరికిపోయాడు. ఈ దారుణ ఘటన పంజాబ్‌లోని మొహాలి జిల్లాలో సోమవారం (ఏప్రిల్ 8) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని మొహాలి జిల్లాలో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న ఏక్తా (27) ఖరార్ ప్రాంతంలోని సన్నీ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటోంది. శనివారం తెల్లవారుజామున తన కారులో ఇంటికి తిరిగి వచ్చింది. అనంతరం కాసేపటికే ఆమె స్నేహితుడైన అనాస్ ఖురేషీ (30) ఆమె ఇంటికి వచ్చాడు. అతనితోపాటు పదునైన కత్తి కూడా తీసుకొచ్చాడు. ఏం జరిగిందో తెలియదు గానీ అతను ఏక్తాను మెడపై కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం ఆమె కారులో అక్కడి నుంచి పారిపోయాడు. ఖరార్‌లోని సన్నీ ఎన్‌క్లేవ్‌లో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలో ఖురేషీ బాధితురాలి ఇంటి నుంచి బయటకు వచ్చి ఆమె కారులో పారిపోతున్నట్లు కనిపించింది. అలా అతడు 70 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత హర్యానాలోని షహాబాద్ సమీపంలో ప్రమాదానికి గురై, తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన ఖురేషీ చండీగఢ్‌లోని ప్రభుత్వ వైద్య కాలేజీ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు ఈ కేసు గురించి ఆరా తీయగా హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. కోలుకున్న తర్వాత అతడ్ని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఖరేషీ చండీగఢ్‌లో తినుబండారం దుఖాణం నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు. స్నేహితురాలు ఏక్తా హత్య వెనుక గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.