TMC Protest: ఢిల్లీలో హైడ్రామా.. ఈసీ కార్యాలయాన్ని ముట్టడించిన TMC.. ఎంపీల అరెస్ట్
బెంగాల్‌లో ఎన్నికల వేళ కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు టీఎంసీ నేతలు. 24 గంటల ధర్నా చేపట్టిన టీఎంసీ ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు.

బెంగాల్‌లో ఎన్నికల వేళ కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు టీఎంసీ నేతలు. 24 గంటల ధర్నా చేపట్టిన టీఎంసీ ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు హైడ్రామా చోటు చేసుకుంది. ఈసీ కార్యాలయాన్ని ముట్టడించారు 10 మంది టీఎంసీ ఎంపీలు. బెంగాల్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థలు అన్యాయంగా టీఎంసీ నేతలను టార్గెట్ చేస్తున్నాయని , అయినప్పటికి ఈసీ ప్రేక్షకపాత్ర పోషిస్తోందని ఎంపీలు ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల వేళ కావాలనే తమ పార్టీని ఈడీ , సీబీఐ , ఐటీ శాఖలు టార్గెట్ చేశాయని టీఎంసీ ఎంపీలు ఆరోపించారు. బీజేపీ చేతిలో కేంద్ర దర్యాప్తు సంస్థలు పావులుగా మారిపోయాయని అన్నారు. దీంతో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందన్నారు.
ఈసీ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న టీఎంసీ ఎంపీలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించారు. పోలీసులకు , టీఎంసీ ఎంపీలకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో ఎంపీ డోలాసేన్ కిందపడిపోయారు. పోలీసుల తీరుపై టీఎంసీ ఎంపీలు మండిపడ్డారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఎన్నికల వేళ బెంగాల్‌లో టీఎంసీ నేతలపై ఎన్‌ఐఏ , సీబీఐ , ఐటీ , ఈడీ సంస్థలు దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. వెంటనే ఎన్నికల సంఘం ఎన్‌ఐఏ, సీబీఐ , ఐటీ , ఈడీ చీఫ్‌లను మార్చాలని టీఎంసీ ఎంపీ డోలా సేన్ డిమాండ్ చేశారు.
ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో గత శుక్రవారం ఇద్దరు టీఎంసీ నేతలను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. అయితే అరెస్ట్ సందర్భంగా ఎన్‌ఐఏ అధికారులు మహిళలపై దాడులకు పాల్పడ్డారని టీఎంసీ నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలను ఎన్‌ఐఏ తీవ్రంగా ఖండించింది. గ్రామస్తులే తమ వాహనాలపై దాడి చేశారని ఎన్‌ఐఏ అధికారులు వెల్లడించారు. ఎన్‌ఐఏ తీరుపై మండిపడ్డారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ప్రజాస్వామ్యాన్ని కాపడడానికి విపక్షాలు ఏకం కావాలన్నారు మమతా బెనర్జీ.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




