Mamata Banerjee : మమతా బెనర్జీ హస్తిన పర్యటన, ఇవాళ ప్రధాని మోడీ, కాంగ్రెస్ నేతలతో కీలక భేటీలు
నేడు ప్రధాని మోడీ, కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ. సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోడీని దీదీ కలవనున్నారు...
Mamata Banerjee in Delh : నేడు ప్రధాని మోడీ, కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ. సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోడీని దీదీ కలవనున్నారు. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు తరువాత తొలిసారి ఇవాళ ప్రధానితో మమత సమావేశం కానున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు కమల్ నాథ్, 3 గంటలకు ఆనంద్ శర్మ, 6:30 కి అభిషేక్ మను సింగ్విని కూడా మమతా బెనర్జీ కలవనున్నారు.
పనిలోపనిగా, ఢిల్లీ పర్యటనలో బిజెపి వ్యతిరేక పార్టీలన్నింటినీ కూడగట్టే పనిలో మమతా బెనర్జీ పావులు కదపబోతున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల లక్ష్యంగా విపక్షాల ఐక్యత కోసం వ్యూహాలు పన్నుతోన్న మమతా బెనర్జీ.. బిజెపి వ్యతిరేక ఐక్య కూటమి ఏర్పాటు, పెగాసస్ స్పై వేర్ అంశం, కేంద్ర విధానాలపై కాంగ్రెస్ పార్టీ నేతలతో ఇవాళ్టి భేటీలో చర్చించనున్నారు.
అటు, మమతాబెనర్జీ రేపు సాయంత్రం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కూడా కలుస్తారు. వీరిద్ధరి మధ్య దేశరాజకీయాలపై సుదీర్ఘ చర్చ జరగనుందని భోగట్టా.
Read also : Fishing : సుందిళ్ళ బ్యారేజి దగ్గర చేపల కోసం పోటెత్తిన జనం.. కనువిందు చేస్తోన్న మత్స్య సంపద