AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహుల్ గాంధీని హీరో చేయాలన్నది BJP ప్లాన్.. దీని వెనుక లెక్క ఇదేనంటూ మమత సంచలన వ్యాఖ్యలు

రాహుల్ గాంధీని హీరో చేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. అందుకే యూకే వేదికగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కారణంగా చూపుతూ పార్లమెంటు సమావేశాలను బీజేపీ అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు.

రాహుల్ గాంధీని హీరో చేయాలన్నది BJP ప్లాన్.. దీని వెనుక లెక్క ఇదేనంటూ మమత సంచలన వ్యాఖ్యలు
Mamata BanerjeeImage Credit source: TV9 Telugu
Janardhan Veluru
|

Updated on: Mar 20, 2023 | 12:06 PM

Share

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల మధ్య సఖ్యత ఎండమావేనని తేలిపోయింది. విపక్షాల ఐక్య సారధిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని అంగీకరించే ప్రసక్తే లేదని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ తెగేసి చెప్పేశారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి తీవ్ర విమర్శనాస్త్రాలు చేసిన ఆమె.. రాహుల్ గాంధీ విపక్షాల తరఫు ముఖంగా ఉంటే ప్రధాని మోదీని టార్గెట్ చేయడం సాధ్యంకాదని వ్యాఖ్యానించారు. ముర్షిదాబాద్‌లో ఆదివారంనాడు తమ పార్టీ జిల్లా కార్యకర్తల అంతర్గత సమావేశాన్ని ఉద్దేశించి ఫోన్‌లో మాట్లాడిన ఆమె.. ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని గొప్ప స్థాయిలో చూపించేందుకు రాహుల్ గాంధీని ప్రతిపక్షంలో అగ్రగామిగా ఉంచాలని బీజేపీ నేతలు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. బలహీనమైన నాయకుడిని ప్రతిపక్షాల ముఖంగా ఉంచడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్నది బీజేపీ నేతల రాజకీయ ఎత్తుగడగా మమత అభిప్రాయపడ్డారు.

రాహుల్ గాంధీని హీరో చేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోందని మమత ఆరోపించారు. అందుకే పార్లమెంటు సమావేశాలను బీజేపీ సజావుగా సాగనివ్వడం లేదన్నారు. రాహుల్ గాంధీ ప్రతిపక్షాల ముఖంగా ఉంటే బీజేపీకి, ప్రధాని మోదీకి లాభం చేకూరుతుందని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీకి అతిపెద్ద టీఆర్పీ రాహుల్ గాంధీయేనంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ విపక్షాల ముఖంగా ఉంటే.. మోదీని ఎవ్వరూ ఓడించలేరన్నది బీజేపీ లెక్కగా పేర్కొన్నారు.

బీజేపీ ఎదుట కాంగ్రెస్ మోకరిల్లుతోందని మమత ఆరోపించారు. బీజేపీని గట్టిగా ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం చెందిందని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలను దూరం చేసేందుకు కాంగ్రెస్, సీపీఎం, బీజేపీలు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ మూడు పార్టీల మధ్య అనైతిక బంధం ఉందని ఆరోపించారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి