World Heritage Site: యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు కోసం మహారాష్ట్రలోని 14 కోటలకు నామినేషన్!
World Heritage Site: మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రముఖ కోటలకు వారసత్వ సైట్ (హెరిటేజ్ సైట్) ట్యాగ్ కోసం నామినేషన్ సమర్పించింది. మరాఠా మిలటరీ ఆర్కిటెక్చర్ అనే అంశంపై ఈ నామినేషన్ వేశారు.

World Heritage Site: మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రముఖ కోటలకు వారసత్వ సైట్ (హెరిటేజ్ సైట్) ట్యాగ్ కోసం నామినేషన్ సమర్పించింది. మరాఠా మిలటరీ ఆర్కిటెక్చర్ అనే అంశంపై ఈ నామినేషన్ వేశారు. 17వ శాతాబ్ధపు మహారాజు ఛత్రపతి శివాజీ సమయంలోని 14 కోటలను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు కోరుతూ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా భారత పురావస్తు సర్వే యునెస్కోకు నామినేషన్ పంపించింది. యునెస్కో తన ప్రపంచ వారసత్వ సైట్ తాత్కాలిక జాబితాలలో ఈ నామినేషన్ ను అంగీకరించింది. ప్రపంచ వారసత్వ సంపదల కార్యాచరణ మార్గదర్శకాల ప్రకారం, తాత్కాలిక జాబితా అంటే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అర్హమైనవిగా ఒక దేశం విశ్వసించే లక్షణాల “జాబితా”. యునెస్కో తాత్కాలిక జాబితాలో ఒక ఆస్తిని చేర్చిన తరువాత, ఆ దేశం యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ కోసం మరో నామినేషన్ పత్రాన్ని సిద్ధం చేయాలి. ప్రపంచ వారసత్వ ప్రదేశం అంటే “అత్యుత్తమ సార్వత్రిక విలువ” ఉన్న ప్రదేశం. ఇది “సాంస్కృతిక లేదా సహజ ప్రాముఖ్యతను సూచిస్తుంది.
మహారాష్ట్ర ప్రతిపాదనలోని 14 కోటలు
రాయ్ గడ్ కోట..
మొదట రాయ్రి అని పిలువబడే ఇది సహ్యాద్రిస్ లోని ఒక కొండ యొక్క పెద్ద చీలికపై దీనిని నిర్మించారు. ఇది ప్రధాన శ్రేణి నుండి లోయ ద్వారా వేరు చేయబడింది. మరాఠా సామ్రాజ్యం రాజధాని కోట ఇది. దీనిని ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం కోసం పునర్నిర్మించారు.
రాజ్‌గడ్ కోట
ఛత్రపతి శివాజీ ఆధ్వర్యంలోని మరాఠా సామ్రాజ్యం రాజధాని. పూణే జిల్లాలోని కొండ కోట. రాయ్ గడ్ కోటకు రాజధాని మార్చడానికి ముందు దాదాపు 26 సంవత్సరాలు ఇదే రాజధాని కోట.
శివనేరి కోట
పూణే జిల్లాలోని జున్నార్ సమీపంలో ఉంది ఈ కోట. ఛత్రపతి శివాజీ జన్మస్థలం. ఇది 7 ద్వారాలను కలిగి ఉంటుంది. గెరిల్లా యుద్ధపు కథనానికి నేపథ్యాన్ని అందించే నిజాంషాహి నిర్మాణానికి ఈ కోట ఒక ఉదాహరణ.
సుడిగ కోట
1646 లో శివాజీని 16 ఏళ్ళ వయసులో బంధించిన పూణే జిల్లాలోని కోట ఇది. ఇక్కడ నుంచే మరాఠా సామ్రాజ్యానికి నాంది ఏర్పడింది.
లోహగడ్
లోనావాలాకు దగ్గరగా ఉంటుంది ఈ కోట. 14 వ శతాబ్దంలో నిర్మించిందని చెబుతారు. ఇది చాలా సుందరమైన లోయలలో ఒకదానిలో నిర్మితం అయింది. మరాఠా కొండ కోట నిర్మాణానికి ఇది ఒక ఉదాహరణ.
సల్హెర్ ఫోర్ట్
నాసిక్‌లోని డోల్హారీ శ్రేణిలో ఉన్న సహ్యాద్రిస్‌లో ఎత్తైన కోటలలో ఒకటి. ఈ కోట 1672 లో మరాఠాలు మరియు మొఘలుల మధ్య కీలక యుద్ధానికి సాక్ష్యంగా నిలిచింది.
ముల్హెర్ కోట
నాసిక్‌లో కొండపై ఉన్న మూడు కోటలలో ఒకటి. దీనికి తూర్పున మోరా, పశ్చిమాన హట్గాడ్ ఉన్నాయి. ముల్హెర్ లొంగిపోవడంతో మూడవ మరాఠా యద్ధం ముగిసింది.
రంగన కోట
కొల్లాపూర్‌లో, సింధుదుర్గ్ సరిహద్దులో ఉంది. ఔరంగజేబ్ తన దక్కన్ ప్రచారంలో భుదర్గాడ్ మరియు సమంగాడ్ లతో పాటు దీనిని జయించటానికి ప్రయత్నించాడు, అది విజయవంతం కాలేదు.
అంకై టాంకై కోటలు
నాషిల్ జిల్లాలో, అంకై, టాంకైలు ప్రక్కనే ఉన్న కొండలపై ప్రత్యేక కోటలు. అసాధారణ సాధారణ కోట గోడ వీటి ప్రత్యేకత.
కాసా కోట
మురుద్ తీరంలో రాతి ద్వీపంలో నిర్మించిన పద్మదుర్గ్ అని ప్రసిద్ది చెందింది. నావికాదళ సైనిక కార్యకలాపాలకు ఈ కోట ఒక స్థావరాన్ని అందించింది.
సింధుదుర్గ్ కోట
1668 లో ఛత్రపతి శివాజీ మహారాజ్ నిర్మించిన ఈ సముద్ర కోట సైనిక రక్షణలో ఒక ఉత్తమ నిర్మాణంగా పరిగణిస్తారు.
అలీబాగ్ కోట
కులాబా కోటగా ప్రసిద్ది చెందిన దీనిని ఛత్రపతి శివాజీ నావికా స్థావరంగా రూపొందించిన కోటలలో ఒకటిగా ఎంపిక చేశారు.
సువర్నదుర్గ్
ఒక ద్వీపంలో నిర్మించిన దీనిని 1660 లో శివాజీ మహారాజ్ మరమ్మతులు చేసి బలోపేతం చేశారు.
ఖండేరి కోట
1998 లో అధికారికంగా కాన్హోజీ అంగ్రే ద్వీపం అని పేరుబడిన ఖండేరి ముంబైకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1679 లో నిర్మించిన ఖండేరి కోట శివాజీ మహారాజ్ దళాలకు, సిద్ధుల నావికాదళానికి మధ్య అనేక యుద్ధాలకు వేదికగా నిలిచింది.



