Maharashtra: కదులుతున్న రైలు నుంచి పడిపోయిన ప్రయాణికుడు.. రెప్పపాటులో ప్రాణాలను కాపాడిన ఆర్‌పీఎఫ్ జవాన్లు.. వీడియో వైరల్

కదులుతున్న రైలు ఎక్కడం.. దానిలో నుంచి దిగడం లాంటివి చేయోద్దంటూ అందరూ పదే పదే చెబుతుంటారు. కానీ కొందరు అవేమీ పట్టించుకోకుండా ప్రాణాల మీదకు..

Maharashtra: కదులుతున్న రైలు నుంచి పడిపోయిన ప్రయాణికుడు.. రెప్పపాటులో ప్రాణాలను కాపాడిన ఆర్‌పీఎఫ్ జవాన్లు.. వీడియో వైరల్
Follow us

|

Updated on: Jan 31, 2021 | 11:05 AM

Railway Cops Save Life Of Man: కదులుతున్న రైలు ఎక్కడం.. దానిలో నుంచి దిగడం లాంటివి చేయోద్దంటూ అందరూ పదే పదే చెబుతుంటారు. కానీ కొందరు అవేమీ పట్టించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి సందర్భాల్లో చాలామంది ప్రాణాలు కొల్పోతుండగా.. కొందరు త్రుటిలో బయటపడుతుంటారు. తాజాగా మహారాష్ట్రలోని కల్యాణ్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మహారాష్ట్ర రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది 76ఏళ్ల వ్యక్తి ప్రాణాన్ని కాపాడారు.

కల్యాణ్ రైల్వేస్టేషన్ లో 4వ నెంబర్ ప్లాట్ ఫాంపై శుక్రవారం రాత్రి 8:30 గంటలకు మన్సూర్ అహ్మద్ అనే వ్యక్తి పంజాబ్ రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తూ జారిపడ్డాడు. దీంతో ఆయన ప్లాట్ ఫాం, రైలు మధ్య చిక్కుకుపోయాడు. వెంటన స్పందించిన ఆర్పీఎఫ్ పోలీసులు రెప్పపాటులోనే బాధితుడిని బయటకు లాగి ప్రాణాలను కాపాడారు. దీని గురించి ఆర్పీఎఫ్ పోలీసులు శనివారం వెల్లడించారు. ఈ ఘటన స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డు కాగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ప్రయాణికుడి ప్రాణాలను కాపాడిన ఆర్‌పీఎఫ్ జవాన్లు ఎస్సీ యాదవ్, జితేంద్ర గుజార్ అందరూ ప్రశంసిస్తున్నారు.

Also Read:

Railway Budget 2021: రేపు కేంద్ర బడ్జెట్‌.. ప్రైవేటు రైళ్ల కూత.. కొత్త రైళ్లపై ప్రత్యేక దృష్టి