AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pro-Atiq Posters: గ్యాంగ్‌స్టర్‌ అతిఖ్‌ అహ్మద్‌‌కు మద్ధతుగా మహారాష్ట్రలో పోస్టర్లు.. నలుగురు వ్యక్తులు అరెస్ట్..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పోలీసు కస్టడీలో దారుణహత్యకు గురైన గ్యాంగ్‌స్టర్‌ అతిఖ్‌ అహ్మద్‌ అష్రఫ్‌లకు మద్దతుగా మహారాష్ట్ర లోని బీడ్‌లో పోస్టర్లు వెలిశాయి. బీడ్‌ పట్టణం నడిబొడ్డున అతిఖ్‌,అష్రఫ్‌ అమరులంటూ వెలిసిన పోస్టర్లు వెలిశాయి.

Pro-Atiq Posters: గ్యాంగ్‌స్టర్‌ అతిఖ్‌ అహ్మద్‌‌కు మద్ధతుగా మహారాష్ట్రలో పోస్టర్లు.. నలుగురు వ్యక్తులు అరెస్ట్..
Pro-Atiq Ahmed Posters in Maharashtra
Janardhan Veluru
|

Updated on: Apr 19, 2023 | 4:28 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పోలీసు కస్టడీలో దారుణహత్యకు గురైన గ్యాంగ్‌స్టర్‌ అతిఖ్‌ అహ్మద్‌ అష్రఫ్‌లకు మద్దతుగా మహారాష్ట్ర లోని బీడ్‌లో పోస్టర్లు వెలిశాయి. బీడ్‌ పట్టణం నడిబొడ్డున అతిఖ్‌,అష్రఫ్‌ అమరులంటూ వెలిసిన పోస్టర్లు వెలిశాయి. వీహెచ్‌పీ నేతలు ఫిర్యాదు చేయడంతో వెంటనే పోలీసులు స్పందించారు. అతిఖ్‌, అష్రఫ్‌లకు అనుకూలంగా ఏర్పాటుచేసిన పోస్టర్లను తొలగించారు. పోస్టర్లు వేసిన నలుగురు యువకులను అరెస్ట్‌ చేశారు.

మరోవైపు పరారీలో ఉన్న అతిఖ్‌ అహ్మద్‌ భార్య షాహిస్తా పర్వీన్‌ ఆచూకీ ఇంకా చిక్కడం లేదు. సిట్‌ బృందం షాహిస్తా కోసం యూపీతో పాటు ఢిల్లీ లోని పలు ప్రాంతాల్లో గాలిస్తోంది. బుర్ఖా ధరించిన పర్వీన్‌ను పట్టుకోవడం పోలీసులకు కష్టంగా మారింది.

పోలీస్ కస్టడీలోని అతిఖ్‌, అష్రఫ్‌ను కాల్చి చంపిన ముగ్గురు నిందితులకు ప్రయాగ్‌రాజ్‌ కోర్టు నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది.

ఇవి కూడా చదవండి

అటు హత్య జరిగిన రోజు అతిఖ్‌,అష్రఫ్‌కు భద్రతగా ఉన్న ఐదుగురు పోలీసులను యూపీ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వాళ్లపై సస్పెన్షన్ వేటు పడింది.

యూపీ గ్యాంగ్‌స్టర్‌ అతిఖ్‌ అహ్మద్‌ , అతడి సోదరుడు అష్రఫ్‌ హత్య కేసులపై దాఖలైన పిటిషన్‌ను ఈనెల 24న సుప్రీంకోర్టు విచారించనుంది. అతిఖ్‌ హత్యపై సీబీఐతో లేదా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి అమితాబ్‌ ఠాకూర్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

అంతకుముందు అతిఖ్‌ హత్యపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని లాయర్‌ విశాల్‌ తివారి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. యూపీలో జరిగిన 180 ఎన్‌కౌంటర్లపై దర్యాప్తు జరపాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..