Electric Bicycle: 20 ఏళ్ల యువకుడి అద్భుత సృష్టి.. రూ.20వేలకే ఎలక్ట్రిక్ సైకిల్.. పూర్తి వివరాలు..
మధ్యప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు అతి తక్కువ ధరలోనే ఓ ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేసి ఔరా అనిపించాడు. కేవలం రూ.20,000 ల ఖర్చుతో ఏకంగా 100 కిలోల వరకూ బరువును మోయగల సామర్థ్యంతో దీనిని తయారు చేశాడు. దీనిలోని బ్యాటరీతో సింగిల్ చార్జ్ పై 30 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చని వివరిస్తున్నాడు.

దేశంలో ట్యాలెంట్‌కు కొదువ లేదు. కానీ ప్రోత్సాహమే అవసరమైనంత లేదన ఇటువంటివి చూస్తున్నప్పుడు అనిపిస్తుంటుంది. ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది కదా.. కానీ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలంటే అధిక ధర వెచ్చించాల్సి వస్తోంది. అయితే మధ్యప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు అతి తక్కువ ధరలోనే ఓ ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేసి ఔరా అనిపించాడు. కేవలం రూ.20,000 ల ఖర్చుతో ఏకంగా 100 కిలోల వరకూ బరువును మోయగల సామర్థ్యంతో దీనిని తయారు చేశాడు. దీనిలోని బ్యాటరీతో సింగిల్ చార్జ్ పై 30 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చని వివరిస్తున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
అన్ని ఫీచర్లతో..
మధ్యప్రదేశ్ లోని ఛతర్ పూర్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల యువకుడు ఆదిత్య శివ్ హరే ఓ ఎలక్ట్రిక్ సైకిల్ ను తయారు చేశాడు. దీని ఖరీదు రరూ. 20,000 మాత్రమే. ఇది ఒక క్వింటా వరకూ బరువును మోయగలుతుంది. దీనిలోని బ్యాటరీని ఒకసారి చార్జ్ చేస్తే 30 కిలోమీటర్లకు వరకూ ప్రయాణించగలుతుంది. దీనిలో సాధారణ ఎలక్ట్రిక్ బైక్ ఉండే అన్నీ ఫీచర్లు ఉన్నాయి. యాక్సలరేటర్, బ్రేక్, లైట్లు, హారన్ ఉన్నాయి. మొబైల్ స్టాండ్ కూడా ఉంది.
అల్వా ఎడిసన్ స్ఫూర్తితో..
ఈ సందర్భంగా ఆదిత్య మాట్లాడుతూ పేదలకు లక్షలు పెట్టి ఎలక్ట్రిక్ బైక్ ను కొనుగోలు చేయలేకపోతున్నారని.. అటువంటి వారిని అనువైన బడ్జెట్ లో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేసినట్లు చెప్పారు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ పేరు ఏ1గా నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. తను 16 ఏళ్ల వయసులోనే వైర్లు లేకుండా కరెంటు ప్రవహించేలా చేశానని చెప్పాడు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ కూడా మెచ్చుకున్నారని చెప్పాడు. ఎలక్ట్రిక్ బల్బును కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ తనకు స్ఫూర్తి అని ఆదిత్య చెబుతున్నాడు.



మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




