BJP: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ కార్యకర్త హత్య.. కత్తులతో పొడిచి చంపిన ప్రత్యర్ధులు..
కోటూరు గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షుడు, బీజేపీ యువమోర్చా నాయకుడు ప్రవీణ్ (36) హత్య కేసు రాజకీయ మలుపు తిరిగింది. ఎన్నికల వేళ ఇలాంటి ఘటనే చోటుచేసుకోవడంతో.. ఈ ఘటనపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ధార్వాడ్‌లోని ఎస్‌డిఎం ఆసుపత్రికి వెళ్లారు..

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ యువమోర్చా నేత ప్రవీణ్‌కుమార్ హత్య తీవ్ర కలకలం రేపింది. హుబ్లీలో ప్రవీణ్‌కుమార్‌ను దారుణంగా హత్య చేశారు ప్రత్యర్ధులు. కొత్తూరు గ్రామంలో ఉదాచమ్మ దేవి ఆలయం జాతర సందర్భంగా కొందరు మద్యం మత్తులో గొడవకు దిగారు. వాళ్లకు నచ్చచెప్పడానికి వెళ్లిన ప్రవీణ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపారు. ప్రవీణ్‌కుమార్ హత్య కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఒవైపు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న సమయంలో బీజేపీ యువమోర్చా నేత హత్య కర్నాటకలో సంచలనం రేపింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ప్రవీణ్‌కుమార్ హత్యతో ధార్వాడ్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. అదనపు బలగాలను తరలించారు. ఇదిలావుంటే, కోటూరు గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షుడు, బీజేపీ యువమోర్చా నాయకుడు ప్రవీణ్ హత్య కేసు రాజకీయ మలుపు తిరుగుతోంది. ఎన్నికల వేళ ఇలాంటి ఘటనే చోటుచేసుకోవడం సంచలనంగా మారింది.
ఈ ఘటనపై బీజేపీ నేతలు ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ధార్వాడ్‌లోని ఎస్‌డిఎం ఆసుపత్రికి వెళ్లి ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులకు పరామర్శించారు. అనంతరం మాట్లాడిన ఆయన.. ఇది రాజకీయ హత్య అని విమర్శించారు. బీజేపీకి చెందిన కార్యకర్త హత్యకు గురయ్యారన్నారు. దీనిపై విచారణ జరుగుతోందన్నారు. గతంలో యోగీష్ గౌడ్, ఇప్పుడు ప్రవీణ్ హత్యకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం
