AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేరు మారిన మరో రైల్వే స్టేషన్.. ఆమోదం తెలిపిన భారత రైల్వే!

సెంట్రల్ మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ రైల్వే స్టేషన్ అధికారికంగా ధారాశివ్ గా పేరు మార్చడం జరిగింది. ఈ మేరకు భారత రైల్వేస్ అధికారికంగా ప్రకటించింది. ఇక నుంచి కొత్త స్టేషన్ కోడ్ DSRV అవుతుంది. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం అప్పటికే నగరం పేరును మార్చింది. తాజాగా రైల్వే స్టేషన్‌ పేరు మారుస్తూ ఉత్వర్వులు వెలువడ్డాయి.

పేరు మారిన మరో రైల్వే స్టేషన్.. ఆమోదం తెలిపిన భారత రైల్వే!
Osmanabad As Dharashiv
Balaraju Goud
|

Updated on: May 30, 2025 | 9:17 PM

Share

మహారాష్ట్రలో ఉన్న ప్రముఖ రైల్వే స్టేషన్ పేరు మారింది. అధికారికంగా మార్చుతూ భారత రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది. సెంట్రల్ రైల్వే ఉస్మానాబాద్ రైల్వే స్టేషన్ పేరును ధరాశివ్ గా మార్చింది. దీనికి సంబంధించి సెంట్రల్ రైల్వే శుక్రవారం సమాచారం ఇచ్చింది. గతంలో ఈ స్టేషన్‌ను ఉస్మానాబాద్ అని పిలిచేవారు. ఈ స్టేషన్ కోడ్ UMD. ఇప్పుడు దాని కొత్త పేరు ధరశివ్‌గా మార్చడంతో కొత్త స్టేషన్ కోడ్ DRSVగా మారింది.

మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉస్మానాబాద్ నగరం, జిల్లా పేరును ధారశివ్‌గా మార్చింది. దీంతో రైల్వే స్టేషన్ పేరును మార్చాలనే ప్రతిపాదన రైల్వేల వద్ద పెండింగ్‌లో ఉంది. రైల్వేస్ స్టేషన్ పేరును కూడా ధారశివ్‌గా మార్చింది. స్టేషన్ పేరు మార్చడంతో పాటు, స్టేషన్ కోడ్ కూడా మారిపోయింది. దీనికి సంబంధించి ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. రైల్వే స్టేషన్ పేరు మార్చడంతో పాటు, కోడ్ మారుస్తూ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

కొత్త రైల్వే స్టేషన్ పేరు, కోడ్‌ను ఇండియన్ రైల్వే కాన్ఫరెన్స్ అసోసియేషన్ ఆమోదించిందని పత్రికా ప్రకటన తెలిపింది. పేరు మార్పు ప్రక్రియ కోసం, ముంబై ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) జూన్ 1, 2025న రాత్రి 11:45 నుండి తెల్లవారుజామున 01:30 వరకు తాత్కాలికంగా మూసివేయన్నట్లు తెలిపింది.

20వ శతాబ్దపు హైదరాబాద్ రాష్ట్ర పాలకుడి పేరు మీద ఉస్మానాబాద్ అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతంలోని 8వ శతాబ్దపు గుహ సముదాయం పేరు ధరశివ. ఈ గుహకు సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. ఉస్మానాబాద్ నగరం పేరు మార్చాలనే డిమాండ్‌కు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. మే 8, 2024న, నగరం పేరు మార్చే ప్రతిపాదనను షిండే ప్రభుత్వం ఆమోదించింది. ఆ తరువాత రైల్వే స్టేషన్ పేరు మార్చాలనే ప్రతిపాదన రైల్వే వద్ద పెండింగ్‌లో ఉంది. ఎట్టకేలకు స్టేషన్ పేరు మార్చడానికి రైల్వేలు ఆమోదం తెలిపాయి. దీనికి సంబంధించి ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..