Maharashtra: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శివసేన మంత్రి.. రోడ్లు హేమమాలిని బుగ్గల్లా ఉన్నాయంటూ..
Maharashtra Mnister Gulabrao Patil: మహారాష్ట్ర మంత్రి, శివసేన నాయకుడు గులాబ్ రావ్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన నియోజవర్గంలో అభివృద్ధి పరుగులు

Maharashtra Mnister Gulabrao Patil: మహారాష్ట్ర మంత్రి, శివసేన నాయకుడు గులాబ్ రావ్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన నియోజవర్గంలో అభివృద్ధి పరుగులు తీస్తోందని.. రోడ్లు సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని బుగ్గల్లా ఉన్నాయంటూ గులాబ్‌రావు పాటిల్ అభివర్ణించారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలతో మహారాష్ట్ర ప్రతిపక్ష పార్టీ బీజేపీ, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ.. రాష్ట్ర మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రూపాలి చకన్కర్ స్పందించారు. వెంటనే మంత్రి బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. మహిళలను తక్కువ చేసి మాట్లాడుతున్నారని.. రాజకీయాల్లో మహిళలు ఆట వస్తువులుగా మారిపోయారంటూ బజేపీ నేతలు శివసేనపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా.. ఆదివారం రాష్ట్రంలోని జల్గాన్ జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాటిల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
గత 30 ఏళ్లుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వారందరూ తన నియోజకవర్గానికి వచ్చి రోడ్లను చూడాలంటూ మంత్రి పేర్కొన్నారు. తన నియోజవర్గంలోని రోడ్డు హేమామాలిని బుగ్గలు లాగా వారికి నచ్చకుంటే.. తాను రాజీనామా చేస్తానంటూ గులాబ్ రావు పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్సీపీ నేత ఏక్‌నాథ్ ఖడ్సే నియోజవకర్గమైన ముఖ్తాయినగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాటిల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా.. అంతకుముందు కూడా పలువురు నాయకులు హేమామాలిని బుగ్గలను రోడ్లతో పోల్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు గతంలో దుమారం లేపాయి.
Also Read:
