AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajya Sabha Election: ఎంఐఎం సంచలన నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికల్లో ఆ కూటమికి మద్దతు..

ఎంఐఎం పార్టీకి చెందిన ఇద్దరు మహారాష్ట్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ప్రతాప్‌గర్హికి ఓటు వేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఔరంగాబాద్‌ ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ పోలింగ్‌కు కొన్ని గంటల ముందు ట్వీట్ చేసి వెల్లడించారు.

Rajya Sabha Election: ఎంఐఎం సంచలన నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికల్లో ఆ కూటమికి మద్దతు..
AIMIM chief Asaduddin Owaisi (File Photo)
Shaik Madar Saheb
|

Updated on: Jun 10, 2022 | 10:01 AM

Share

Rajya Sabha Election 2022: మహారాష్ట్రతోపాటు రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి. ఉదయం నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి కూటమి, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏఐఎంఐఎం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో జరగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి కూటమికి మద్దతు ఇస్తున్నట్లు మజ్లిస్ శుక్రవారం తెలిపింది. ఎంఐఎం పార్టీకి చెందిన ఇద్దరు మహారాష్ట్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ప్రతాప్‌గర్హికి ఓటు వేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఔరంగాబాద్‌ ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ పోలింగ్‌కు కొన్ని గంటల ముందు ట్వీట్ చేసి వెల్లడించారు.

బీజేపీని ఓడించేందుకు మహారాష్ట్రలోని రాజ్యసభ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)కి ఓటు వేయాలని తమ పార్టీ (ఏఐఎంఐఎం) నిర్ణయం తీసుకుందని తెలిపారు. మహారాష్ట్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ప్రతాప్‌గర్హికి ఓటు వేయాలని కోరారు. అయితే శివసేనతో తమ రాజకీయ సైద్ధాంతిక విభేదాలు కొనసాగుతాయని జలీల్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ట్యాగ్ చేస్తూ ట్వీట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

దీనికోసం.. ధూలే, మాలేగావ్‌లోని తమ ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించి పార్టీ కొన్ని షరతులు పెట్టిందని ఎంపీ జలీల్ చెప్పారు. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ లో మైనారిటీ సభ్యుడిని నియమించాలని, మహారాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంఐఎం మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కోరింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..