AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Lady Singham: లైంగిక వేధింపులకు మహారాష్ట్ర ‘లేడీ సింగం’ బలి.. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య..

Forest Officer Suicide: లైంగిక వేధింపు కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది. మగ మృగాల వేధింపులు తాళలేక ఏకంగా..

Maharashtra Lady Singham: లైంగిక వేధింపులకు మహారాష్ట్ర ‘లేడీ సింగం’ బలి.. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య..
Mahas Lady Singham
Shiva Prajapati
|

Updated on: Mar 27, 2021 | 5:57 AM

Share

Forest Officer Suicide: లైంగిక వేధింపు కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది. మగ మృగాల వేధింపులు తాళలేక ఏకంగా ఉన్నతాధికారి తన ప్రాణాలను తానే తీసుకుంది. లేడీ సింగం‌గా పేరు గడించిన ఆర్ఎఫ్ఓ ఇలా ఆత్మహత్యకు పాల్పడటం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మహారాష్ట్ర అమరావతిలోని మెల్ఘాట్ టైగర్ రిజర్వ్ (ఎంఆర్‌టి) లో రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న దీపాలి(28).. ఉన్నతాధికారి లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు సంబంధించి నాలుగు పేజీల సూసైడ్ నోట్ కూడా రాసింది. ఐఎఫ్ఎస్ అధికారి వేధింపుల కారణంగానే తాను చనిపోతున్నట్లుగా తేల్చి చెప్పింది.

పూర్తి వివరాల్లోకెళితే.. మహారాష్ట్రంలో ఆర్ఎఫ్ఓ గా విధులు నిర్వహిస్తున్న దీపాలి చవాన్ మోహితేకి రాజేష్ మోహితేతో వివాహం జరిగింది. ఆమె భర్త ట్రెజరీలో ఉద్యోగం చేస్తున్నారు. భర్తతో కలిసి అమరావతి పరిధిలోని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలోని హరిసల్ గ్రామంలో ప్రభుత్వ క్వార్టర్‌లో ఉంటున్నారు. దీపాలి గత కొంతకాలంగా డిప్రెషన్‌లో ఉన్నారు. దాంతో సతారాలో ఉంటున్న ఆమె శకుంతల అమరావతికి వచ్చారు. దీపాలికి తోడుగా ఉన్నారు.అయితే, అత్యవసర పనులు ఉండటంతో ఇటీవల శకుంతల సతారాకు వెళ్లారు. దీపాలి భర్త రాజేష్ తన ఉద్యోగానికి వెళ్లిపోయాడు. ఇక ఇంట్లో ఎవరై లేని సమయంలో.. దీపాలి తన సర్వీస్ రివాల్వర్‌తో తనను తాను కాల్చుకుంది. ఈ ఘటనలో దీపాలి.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కాగా, ఇంటికి తిరిగి వచ్చిన భర్త రాజేశ్.. రక్తపు మడుగులో విగతజీవిగా పడిఉన్న దీపాలి మృతదేహాన్ని చూసి షాక్ అయ్యారు. ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, దీపాలి మృతదేహం పక్కనే నాలుగు పేజీల సూసైడ్ లెటర్ లభ్యమైంది. అందులో తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం ఐఎఫ్ఎస్ అధికారి వినోద్ శివకుమార్ అని దీపాలి ఆరోపించారు. ఐఎఫ్ఎస్ అధికారి అయిన శివకుమార్.. డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(డీసీఎఫ్)గా విధులు నిర్వర్తిస్తున్నారు. తనలా మెరవరూ అతని చేతిలో బలికావొద్దంటూ దీపాలి తన సూసైడ్ నోట్‌లో తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు.

ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.. అంతేకాదు.. శివకుమార్ తనను ఏ విధంగా వేధింపులకు గురిచేసేవాడనేది తన సూసైడ్ లేఖలో సవివరంగా పేర్కొన్నారు దీపాలి. శివకుమార్ తన పదవిని దుర్వినియోగం చేసేవాడని ఆరోపించారు. తనను లైంగికంగా వేధించాడని, కొన్ని నెలల నుంచి మానసికంగానూ తీవ్రంగా వేధించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. శివకుమార్ వ్యవహారంపై గతంలో అనేక సందర్భాల్లో తన సీనియర్, ఎంటీఆర్ ఫీల్డ్ డైరెక్టర్, ఎంఎస్ రెడ్డి(ఐఎఫ్ఎస్)కు ఫిర్యాదు చేశానని, కానీ, అతను తన ఫిర్యాదును పట్టించుకోలేదని దీపాలి ఆరోపించారు. శివకుమార్ విపరీతంగా మద్యం సేవించి, అసభ్యకరమైన పదజాలంతో తనను దూషించేవాడంది. తనను లైంగికంగా లొంగదీసుకునేందుకు చాలా ప్రయత్నించాడంది. అయినప్పటికీ పలుమార్లు అతన్ని మందలించేదానిని అని, దానికి ప్రతిఫలంగా కఠినమైన పనులు అప్పగించేవాడంది. ఒకసారి నెల జీతాన్ని సైతం వెనక్కి తీసుకున్నారని ఆరోపించింది.

వందల కిలోమీటర్లు నడిపించేవాడు.. 2020లో రాజేష్ మోహితేని వివాహమాడిన దీపాలికి.. గతనెల ఫిబ్రవరిలో గర్భిణిగా నిర్ధారణ అయ్యింది. అయితే, శివకుమార్ ఆమె పరిస్థితిని పట్టించుకోకుండా తనతో పాటు 3 రోజులు అటవీ పెట్రోలింగ్‌కు తీసుకెళ్లాడు. వందలాది కిలోమీటర్ల దూరం నడిపించాడు. అలా వందలాది కిలోమీటర్లు నడవడం, అధిక జర్నీ చేయడంతో దీపాలికి గర్భస్రావం అయ్యిందని. దాంతో దీపాలి తీవ్రమైన డిప్రెషన్‌కు లోనయ్యారు. విషయం తెలుసుకున్న దీపాలి తల్లి శకుంతల చవాన్.. అమరావతికి వచ్చారు. దీపాలితో కలిసి ఆమెకు తోడుగా ఉన్నారు. తాజాగా అత్యవసర పని పడటంతో శకుంతల సతారాకు వెళ్లారు. ఇదే సమయంలో భర్త రాజేశ్ విధులకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దీపాలి తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయింది.

నీతి, నిజాయితీకి మారుపేరు దీపాలి.. ఇదిలాఉంటే.. దీపాలి నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరుగా నిలిచారు. ఐదేళ్ల క్రితం మధ్యప్రదేశ్‌కు రైలులో పారిపోతున్న అటవీ స్మగ్లర్ల ముఠాను దీపాలి తన కారులో వెంబడించి పట్టుకుని తన ధైర్యసాహసాలను ప్రదర్శించారు. ఆ తరువాత ఐదు టన్నుల విలువైన అటవీ ఉత్పత్తులను స్మగ్లింగ్ చేస్తుండగా.. అడ్డుకుని స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఆమె భయంతోనే స్మగ్లర్లు అడవివైపు కన్నెత్తి కూడా చూడలేకపోతున్నారని ఆమె సహచర ఉద్యోగులు చెబుతున్నారు. ఇక 2013 లో మహారాష్ట్ర ప్రభుత్వ సేవలో చేరిన దీపాలి, అడవుల్లో ఆక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టారు. దాని పర్యావసంగా ఆమె స్థానిక రాజకీయ నాయకులు, మాఫియా ఆగ్రహానికి గురవ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ దీపాలి మాత్రం వెనక్కి తగ్గలేదు. స్మగ్లర్లకు, మాఫియకు హడలెత్తించింది.

కాగా, దీపాలి రాసిన నాలుగు పేజీల సూసైడ్ నోట్‌ ఆధారంగా అమరావతి పోలీసులు ఐఎఫ్ఎస్ అధికారి శివకుమార్‌పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బెంగళూరు వెళ్లేందుకు రైల్వే ప్లాట్‌ఫామ్‌పై సిద్ధంగా ఉన్న శివకుమార్‌ను నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం శివకుమార్‌ను అమరావతికి తరలించారు.ఇక దీపాలి ఆత్మహత్యపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ స్పందించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేయిస్తామని, దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Also read:

నడి సముద్రంలో ప్రమాదం.. కళ్లముందే ఒక్కొక్కటిగా పోతున్న ప్రాణాలు.. ఓ యువకుడు మాత్రం ఏం చేశాడంటే..

Low Credit Score: క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? రుణం ఇవ్వమన్నారా? అయితే ఇలా ప్రయత్నించి చూడండి..