మహారాష్ట్రలో తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న కరోనా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా ఎన్ని కేసులంటే..

దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినా.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తీవ్రంగా విజృంభిస్తోంది. మళ్లీ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు అప్రమత్తం ...

మహారాష్ట్రలో తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న కరోనా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా ఎన్ని కేసులంటే..
Follow us

|

Updated on: Feb 23, 2021 | 9:06 PM

దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినా.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తీవ్రంగా విజృంభిస్తోంది. మళ్లీ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి. ఇక దేశంలో పాజిటివ్‌ కేసులు, మరణాల్లో మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్రలో కేసలు సంఖ్య అంతకంతకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6వేలకుపైగా కరోనా కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మంగళవారం కొత్తగా 6218 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 51 మంది మృతి చెందారు. మరో వైపు కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. కేసుల సంఖ్య పెరిగిపోతే మరో రెండు వారాల్లో లాక్‌డౌన్‌ విధించక తప్పదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే పేర్కొంటున్నారు. విదర్భ ప్రాంతంలో కోవిడ్‌-19 తీవ్రత ఎక్కువగా ఉండటంతో పర్భనీ ప్రాంతం వారు విదర్భలోకి వెళ్లకూడదంటూ పర్భనీ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు అర్థరాత్రి నుంచి ఫిబ్రవరి 28వరకూ ఈ నిబంధన అమల్లో ఉంటాయని తెలిపారు.

ఇక ప్రైవేటు, ప్రజారవాణా వ్యవస్థకు కూడా వర్తిస్తుందని సూచించారు. ప్రజల రాకపోకలకు చెక్‌ పెట్టేందుకు పోలీసులు సరిహద్దు వద్ద పెద్ద ఎత్తున మోహరించారు. అత్యవసర సమయాల్లో అయితే ఆర్‌టీ పీసీఆర్ టెస్టులో నెగెటివ్ వచ్చాకే అనుమతి ఇస్తున్నారు.

Also Read: AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే.