COVID-19 vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. రాష్ట్రంలో కేసుల పెరుగుదలపై ఏమన్నారంటే..?

CM Uddhav Thackeray receives Corona vaccine: దేశవ్యాప్తంగా కోవిడ్‌ -19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. దీంతో అర్హత కలిగిన సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు..

COVID-19 vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. రాష్ట్రంలో కేసుల పెరుగుదలపై ఏమన్నారంటే..?
CM Uddhav Thackeray receives Corona vaccine
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 11, 2021 | 2:57 PM

CM Uddhav Thackeray receives Corona vaccine: దేశవ్యాప్తంగా కోవిడ్‌ -19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. దీంతో అర్హత కలిగిన సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు సైతం వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే సైతం కోవిడ్ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. గురువారం ముంబైలోని జేజే ఆసుపత్రిలో ఠాక్రే కరోనా వ్యాక్సిన్‌ తొలిడోసు తీసుకున్నారు. ఆయనతోపాటు ఆయన భార్య , తల్లి కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. భారత్ బయోటెక్ తయారుచేసిన కోవిడ్ వ్యాక్సిన్‌ను ఠాక్రే తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. వ్యాక్సిన్ గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అర్హత కలిగిన వారు ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు. కేసులు పెరుగుతుండటంతో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు ఉద్ధవ్ తెలిపారు. పరిస్థితి అదుపులోకి రాలేదని ఉద్ధవ్ పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. మహారాష్ట్రలో కరోనావైరస్‌ కేసులు మళ్లీ విజృంభిస్తుండటంతో ఆందోళన నెలకొంది. బుధవారం రాష్ట్రంలో ఏకంగా 13,659 కేసులు నమోదయ్యాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ రాష్ట్రంలో కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా నాగపూర్‌ నగరంలో సైతం ఆంక్షలు విధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదిలాఉంటే.. దేశ‌వ్యాప్తంగా కరోనావ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 2,52,89,693 కి చేరినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. గ‌త 24 గంట‌ల్లో 9.2 లక్షల మందికి టీకా పంపిణీ చేసినట్లు పేర్కొంది. ముందుగా జనవరి 16 నుంచి వ్యాక్సిన్‌ను ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి పంపిణీ చేసిన విషయం తెలిసిందే. మార్చి 1నుంచి 60ఏళ్లు పైబడిన వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ల పైన వారికి వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు.

Also Read: Lockdown: మళ్లీ లాక్‌డౌన్‌.. కీలక ఆదేశాలు జారీ చేసిన అధికారులు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!