AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Bengal Elections : బెంగాల్‌లో బీజేపీ – టీఎంసీ మధ్య బిగ్ ఫైట్‌, పోటాపోటీ కంప్లైంట్స్, మమత డిశ్చార్జి తర్వాతే మ్యానిఫెస్టో

West Bengal Elections : అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతోన్న వేళ పశ్చిమ బెంగాల్‌ రగిలిపోతోంది. తాజాగా జరిగిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి మంటలు పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, టీఎంసీ మధ్య ఫైట్‌ పీక్స్‌కు చేరింది. ఇరు వర్గాలు..

West Bengal Elections : బెంగాల్‌లో బీజేపీ - టీఎంసీ మధ్య బిగ్ ఫైట్‌, పోటాపోటీ  కంప్లైంట్స్, మమత డిశ్చార్జి తర్వాతే  మ్యానిఫెస్టో
Venkata Narayana
|

Updated on: Mar 11, 2021 | 3:02 PM

Share

West Bengal Elections : అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతోన్న వేళ పశ్చిమ బెంగాల్‌ రగిలిపోతోంది. తాజాగా జరిగిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి మంటలు పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, టీఎంసీ మధ్య ఫైట్‌ పీక్స్‌కు చేరింది. ఇరు వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. పోటాపోటీగా ఈసీని కలిసి ఫిర్యాదు చేశాయి. ఇలాఉంటే, మమతాబెనర్జీపై దాడి వెనుక బీజేపీ హస్తముందని ఆరోపిస్తున్నారు టీఎంసీ నేతలు. మమత దాడి ఘటనపై ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. సీఎం మమతకు అదనపు భద్రత కల్పించాలని వినతిప్రతం అందించారు. ముఖ్యమంత్రికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈసీదేనన్నారు.

మరోవైపు ఇటు బీజేపీ నేతలు కూడా ఈసీని కలిశారు. ఈ మొత్తం ఘటనపై సీబీఐ దర్యాప్తుకు డిమాండ్‌ చేస్తోంది కమలం పార్టీ. సానుభూతి కోసమే మమత..దాడి నాటకం ఆడుతున్నారని ఫిర్యాదు చేశారు. మరోవైపు మమతపై దాడి ఘటనతో..ఇవాళ రిలీజ్‌ చేయాల్సిన టీఎంసీ మేనిఫెస్టో వాయిదా పడింది. మమత డిశ్చార్జ్‌ అయ్యాకే మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది తృణమూల్‌ కాంగ్రెస్‌. ఇక మమతపై దాడి ఘటనతో పోటాపోటీ నిరసనలకు దిగుతున్నారు బీజేపీ, టీఎంసీ నేతలు. పెద్దసంఖ్యలో రోడ్డుపైకొచ్చిన ఇరు పార్టీల శ్రేణులు.. ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. టైర్లను కాల్చి సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కమలం పార్టీ కార్యకర్తలు. మమత సానుభూతి కోసం నాటకాలాడుతున్నారని ఆరోపిస్తున్నారు.

మరోవైపు తమ అధినేత్రిపై దాడికి నిరసనగా టీఎంసీ శ్రేణులు కూడా పలు చోట్ల ఆందోళనలకు దిగారు. తనపై నలుగురైదుగురు దాడిచేశారని ..గాయాల తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డానని ఆరోపిస్తున్నారు ముఖ్యమంత్రి మమత. ఐతే మమతపై దాడి ఘటనపై సీరియస్‌ అవుతున్నారు బెంగాల్‌ విపక్ష నేతలు. ఇదంతా ఓ డ్రామా అని..పోలీసులు మమత చేతుల్లోనే ఉంటే దాడి ఎలా జరిగిందని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్. ఎన్నికల వేళ సానుభూతి పొందేందుకు నాటకాలాడుతున్నారని ఆరోపిస్తోంది. ఇటు బీజేపీ కూడా ఇది ప్రమాదం మాత్రమేనని కొట్టిపారేసింది.

ఇదిలా ఉంటే..మమత కాలి ఎముకకు ఫ్రాక్చర్‌ అయినట్లు చెబుతున్నారు టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ. ఆమె మెడ, మోచేయి, భుజానికి కూడా తీవ్రగాయాలయ్యాయని ప్రకటించారు. ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్న ఫొటోను షేర్‌ చేశారు. మమతా బెనర్జీకి గాయాలతో ఇవాళ రిలీజ్‌ కావలసిన టీఎంసీ మేనిఫెస్టోపై సందిగ్ధత నెలకొంది. కాగా, నందిగ్రామ్‌ రోడ్‌షోలో తీవ్ర గాయాలపాలైన మమత.. ప్రస్తుతం కోల్‌కతాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 48 గంటలపాటు తమ పరిశీలనలో ఉంచినట్లు ప్రకటించారు డాక్టర్లు. ఎంఆర్‌ఐ స్కానింగ్‌లో ఎముకలో పగులు ఏర్పడినట్లు గుర్తించామని..ప్రస్తుతం ఆమెను వీవీఐపీ బ్లాక్‌లో ఉంచినట్లు వెల్లడించారు.

Read also : NISAR : భూ ఉపరితల మార్పులను క్షుణ్ణంగా పరిశోధించే క్రమంలో మరో మైలురాయి, నాసాతో కలిసి ఇస్రో స్పెషల్ ప్రాజెక్ట్ ‘నిసార్‌’

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!