Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Currency: రెండు వందల నోటుపై‘ఛత్రపతి శివాజీ’ ఫోటో.. ఇదే పర్ఫెక్ట్ అంటూ కామెంట్..

వినాయకుడు, లక్ష్మీదేవి చిత్రాలను భారత కరెన్సీపై ముద్రించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేయడంపై భారతీయ జనతా పార్టీ నేత ఒకరు

Indian Currency: రెండు వందల నోటుపై‘ఛత్రపతి శివాజీ’ ఫోటో.. ఇదే పర్ఫెక్ట్ అంటూ కామెంట్..
Chhatrapati Shivaji
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 27, 2022 | 9:54 PM

వినాయకుడు, లక్ష్మీదేవి చిత్రాలను భారత కరెన్సీపై ముద్రించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేయడంపై భారతీయ జనతా పార్టీ నేత ఒకరు కొత్త డిమాండ్‌ను లేవనెత్తారు. మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు నితీష్ నారాయణ్ రాణే ఛత్రపతి శివాజీ చిత్రంతో కూడిన రూ.200 నోటును విడుదల చేశారు. ఫోటోషాప్ చేసిన ఈ ఫేక్ నోటును ట్విట్టర్‌లో షేర్ చేసిన ఆయన.. ఇదే ఫర్‌ఫెక్ట్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు.

రూపాయి విలువ పడిపోతున్న క్రమంపై స్పందించిన కేజ్రీవాల్.. ‘మనం మన శక్తి మేరకు ప్రయత్నించినప్పటికీ కొన్నిసార్లు దేవుడు, దేవతల ఆశీర్వాదం లేకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు’ అని అన్నారు. అందుకే కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి, గణపతి చిత్రాలను ముద్రించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతానని చెప్పారు. అయితే, ఆయన చేసిన ఈ ప్రకటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదికాస్తా పొలిటికల్ టర్న్ తీసుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రకరకాల డిమాండ్లు వస్తున్నాయి. కొత్త సిరీస్ కరెన్సీ నోట్లపై భీమ్‌రామ్ అంబేద్కర్ ఫోటో ఎందుకు పెట్టకూడదు అని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ప్రశ్నించారు. పంజాబ్‌లోని ఆనంద్‌పూర్ సాహిబ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ తివారీ మాట్లాడుతూ.. కొత్త సిరీస్ కరెన్సీ నోట్లలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఎందుకు పెట్టకూడదు? ఒకవైపు మహాత్మా గాంధీ, మరోవైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రాలను ముద్రించవచ్చునని ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇదిలాఉంటే కేజ్రీవాల్ డిమాండ్‌పై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. గుజరాత్ ఎన్నికల ముందు తన రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి డిమాండ్ కేజ్రీవాల్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆయన హిందూ వ్యతిరేకి అని, హిందూ వ్యతిరేక భావాలను మనసులో ఉంచుకుని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యం అన్నారు బీజేపీ నేతలు. అంతేకాదు.. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడిన ఢిల్లీ మాజీ మంత్రి రాజేంద్రపాల్ గౌతమ్, ఆప్ గుజరాత్ యూనిట్ ప్రెసిడెంట్ గోపాల్ ఇటాలియాను పార్టీ నుంచి బహిష్కరించాలని కేజ్రీవాల్‌ను డిమాండ్ చేశారు బీజేపీ నేతలు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..